Tirumala News : జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి అర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఈనెల 18న సోమవారం ఉదయం ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
లక్కీ టిప్ టిక్కెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు. ఈనెల 21 తేదీ ఉదయం 10 గంటలకు కల్యా ణోత్సవం, అచ్యుత మహోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకా ర సేవా, టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు.
మధ్యాహ్నం మూడు గంటలకు పై సేవల వర్చువల్ సేవా టికెట్లు, దర్శన టికెట్లు కూడా విడుదల చేస్తా రు. జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకం లో పాల్గొనేందుకు ఈనెల 21 తేదీన ఉదయం 10 గంటలకు అందుబాటు లో ఉంచుతారు.