36.5 C
India
Friday, April 10, 2026
More

    రెడ్డిలు వైసీపీకి దూరం..?

    Date:

    ysrcp
    ysrcp
     రెడ్డి సామాజిక వర్గం అధికార పార్టీ వైసీపీకి దూరమవుతున్నారు. కుల పరంగా తమకు వైసిపి తో ఎలాంటి ప్రయోజనం జరగడంలేదని రెడ్డి సామాజిక వర్గాల నేతలు తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీలో ని ఎమ్మెల్యేలు టిడిపిలోని ముఖ్య నాయకులతో ఎప్పుడు టచ్లో ఉంటున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. వైసిపి ఒక నియోజకవర్గంలోనే రెడ్డిలకు ప్రాధాన్యమిస్తున్నారని, గ్రౌండ్ లెవెల్ లో  తమను ఎవరు కేర్ చేయడం లేదని రెడ్డి సామాజిక వర్గ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మీడియా కూడా కొన్ని సందర్భాల్లో రెడ్డిలను చిన్నచూపు చూస్తున్నారని పలు సందర్భాల్లో చూపించడంతో రెడ్డిల్లో ఏదో ఒక తెలియని వెలతి ఏర్పడింది.
    * రెడ్డిల చూపు టిడిపి వైపు..
     మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి వేసిన స్కెచ్ మంచి ఫలితాన్ని ఇచ్చింది. వైసిపి అసంతృప్తిలను, రెడ్డిలను అక్కున చేర్చుకోవడం తోనే టిడిపి విజయం సాధించిందని పలువురు పేర్కొనడం ఆశ్చర్యం కలిగించింది. తాజాగా  ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. బాలినేని కూడా టిడిపి తో టచ్ లో ఉన్నారని ఆ నోట ఈ నోట చాలా బలంగానే వినిపిస్తోంది. బాలినేని అనుచరులు, వైసీపీ శ్రేణులు  మొన్న ఒంగోలులో రైల్వే స్టేషన్ వద్దకు బాలినేనికి  స్వాగతం పలకడానికి వచ్చిన సందర్భంలో ఏ ఒక్కరు కూడా వైసిపి జెండా గాని పార్టీ కండువా గాని వేసుకోవడం కనిపించలేదు. అంతేకాకుండా వేలాదిమంది జై బాలినేని.. జై జై బాలనేని అన్నారే తప్ప జై జగన్ అనే నినాదాలు వినబడలేదు..దీంతో రెడ్డిలు వైసిపికి దూరమవుతున్నారని కళ్ళకు కట్టినట్లు అయింది.
    * రాయలసీమపై కన్నేసిన టిడిపి..
     ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేసిన ఎత్తుగడ ఫలించడంతో అదే ఊపుతో రెడ్డిలను, ఇతర కులస్తులను ప్రలోభాలకు గురిచేసి  టిడిపిలోకి లాక్కునేందుకు పార్టీ ముఖ్య నేతలు  గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.రాయలసీమలో ఏళ్ల తరబడి విజయం సాధించని టిడిపి ఈసారి ఏ విధంగానైనా అక్కడ గెలవాలని పక్కా పథకాలు రచిస్తోంది. అందులో భాగంగానే అక్కడున్న రెడ్డిలను, పెరిక కులస్తులను, అసంతృప్తులను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలుస్తోంది. ఏది ఏమైనా బాలినేని తో పాటు ఇంకా కొంతమంది టిడిపిలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలను చూస్తే వైసీపీకి రెడ్డిలు దూరమవుతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...