Heroins ప్రస్తుతం వస్తున్న హీరోయిన్లు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి పది సినిమాలకు అంగీకారం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలు చేసేందుకు తొందర పడుతున్నారు. అత్యధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. గతంలో హీరోయిన్ అంటే కనీసం ఓ పదేళ్లపాటు తన హవా కొనసాగించేవారు. కానీ ఇప్పుడు పది సినిమాల వరకు కూడా ఉండటం లేదు.
అందుకే అవకాశం ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకోవాలని ఆరాట పడుతున్నారు. తరువాత అంటే కుదరదు. ఎవరెవరో వస్తున్నారు. సినిమాల పరంపర కొనగిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న వారిలో మృణాల్ ఠాకూర్, శ్రీలీల ముందు వరుసలో ఉన్నారు. ఒక్కొక్కరు దాదాపు పదేసి సినిమాలు ఒప్పుకున్నారు. వారికి డేట్స్ ఎలా సెట్ చేస్తున్నారో తెలియడం లేదు. కానీ సినిమాలు మాత్రం ఒప్పుకోవడం గమనార్హం.
శ్రీలీల పవన్ కల్యాణ్ తో నటిస్తూనే సిద్ధూ జొన్నలగడ్డతో కూడా సినిమా చేసేందుకు ఒప్పుకుంది. ఈమె పారితోషికం సినిమాకు రూ. కోటిపైనే డిమాండ్ చేస్తుందట. ఇక మృణాల్ ఠాకూర్ కూడా బాగానే అడుగుతోందట. సినిమాకు రూ. రెండు కోట్లు అడుగుతుండటంతో సినిమా వ్యయం అమాంతం పెరుగుతోంది. సినిమా తీయాలంటే నిర్మాతలకు తలకు మించిన భారమే అవుతోంది.
మృణాల్ హిందీలో రూ. 3నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటోందట. తెలుగులో కూడా రూ. 2 కోట్లు ఇవ్వాలని చెబుతోందట. దీంతో హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఇంత స్థాయిలో పెరగడంతో ప్లాప్స్ జరిగితే మాత్రం వారికి సంబంధమే లేదన్నట్లు ఉంటున్నారు. ఇలా హీరోయిన్లు పారితోషికాలు పెంచడంతో నిర్మాతలకు చుక్కలే కనిపిస్తున్నాయి. భవిష్యత్ లో ఇలా రెమ్యూనరేషన్ పెంచడంతో ఏం చేయాలో తోచడం లేదు.