
Richest Hero in South India : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్ కోట్లలో ఉంటుంది అనే విషయం తెలిసిందే.. మన సౌత్ ఇండియా మరింత వృద్ధి చెందిన తర్వాత హీరోలు తమ రెమ్యునరేషన్ ను మరింతగా పెంచేశారు.. ప్రతీ స్టార్ హీరో 70 నుండి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు..
సినిమాల రెమ్యునరేషన్స్ మాత్రమే కాదు యాడ్స్ ను ప్రమోట్ చేస్తూ కూడా హీరోలు కోట్లు సంపాదిస్తున్నారు.. మరి ఇంత మంది సౌత్ హీరోలు ఉండగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో ఎవరు? ఏ హీరో సౌత్ లోనే ఎక్కువ ఆస్థి ఉన్న హీరో? ఏ హీరో ఎక్కువ పారితోషికం తీసుకుంటూ టాప్ లో ఉన్నారు అనే విషయమే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
సౌత్ ఇండియాలో చాలా మంది హీరోలు ఉన్నారు. వారిలో టాప్ హీరోలు అయితే 50 నుండి 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.. మరి వారిలో రిచెస్ట్ యాక్టర్ ఎవరు అంటే ఒక పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సౌత్ లోనే రిచెస్ట్ హీరో ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అనే చెప్పాలి.

ప్రముఖ సర్వే నివేదికల ప్రకారం నాగార్జున టోటల్ ఆస్తి విలువ 3270 కోట్లుగా తెలుస్తుంది.. సౌత్ లో ఉన్న అగ్ర హీరోలలో నాగార్జునకే ఇంత ఆస్తి ఉందట.. మిగిలిన హీరోలు ఈయన దరిదాపుల్లో కూడా లేనట్టే తెలుస్తుంది.. మిగిలిన హీరోలు వందల కోట్లు వసూళ్లు చేస్తుంటే నాగార్జున కేవలం సినిమాకు 40 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్టు ఈయనే టాప్ లో ఉన్నాడు. అయితే నాగార్జున 3000 వేల కోట్ల ఆస్తి రావడానికి కారణం బిజినెస్ లే అని తెలుస్తుంది..