The Road Trailer : ‘పొన్నియిన్ సెల్వన్’ నుంచి భారీగా ఫామ్ లోకి వచ్చిన త్రిష చేతిలో మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పెళ్లి చేసుకోబోతోందన్న రూమర్స్ రావడంతో ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీలతో దర్శక, నిర్మాతలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇవన్నీ పుకార్లే అంటూ ఆమె కొట్టిపడేసింది. ఇవన్నీ ఇలా ఉంటే ఆమె చేసిన సినిమా ‘ది రోడ్’ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. అరుణ్ వసీగరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 6వ తేదీ రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో వస్తుందని తెలుస్తోంది. హైవేపై ఒక రహస్య ప్రదేశంలో జరిగే ఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇందులో చాలా మంది మరణిస్తుంటారు. ఈ యాక్సిడెంట్లు, దాని వెనుక ఉన్న పరిణామాలను వెలికితీసే భయంకరమైన రోడ్డు ప్రమాదాల వెనుక ఉన్న ప్రమాదకరమైన వివరాలను వెలికితీసే పనిలో పడుతుంది త్రిష. యదార్థ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం మంచి మహిళకు, సైకోకు మధ్య జరిగే వార్ ను చూపెడుతుంది.
ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ తో పాటు సంతోష్ ప్రతాప్, షబ్బీర్ కల్లక్కల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మియా జార్జ్, ఎంఎస్ భాస్కర్, వివేక్ ప్రసన్న, వేలా రామమూర్తి, లక్ష్మీ ప్రియ వంటి నటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సామ్ సీఎస్. మరో వైపు విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా ‘లియో’ చిత్రంలో కూడా కనిపించనుంది.