22.5 C
India
Tuesday, December 3, 2024
More

    OMG 2 : ఆ మూవీలోని సీన్లు మార్చాల్సిందేనట.. సెన్సార్ బోర్డ్ షాక్

    Date:

    OMG-2-movie
    OMG-2-movie

    OMG 2 :

    ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, థ్రిల్లర్ జానర్ ఏదైనా నిరంతరం అలరిస్తాడు హీరో అక్షయ్ కుమార్. సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అన్న దానితో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తాడు. ఓ మై గాడ్ (OMG)తో సక్సెస్ సాధించిన ఆయన ఓ మై గాడ్-2 (OMG2) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఆ సినిమాకు సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది.

    అమిత్ రాయ్ డైరెక్షన్ లో ‘వియాకాం 18 స్టూడియోస్’ ఓ మై గాడ్-2 నిర్మించింది. దీనికి దాదాపు రూ. 150 కోట్లు ఖర్చు చేయగా విడుదల టైం దగ్గర పడడంతో సెన్సార్ బోర్డ్ ఝలక్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదల చెయ్యాలా? వద్దా? అనే అయోమయంలో చిత్రం బృందం ఉంది.

    సుమారు 20 సీన్లలో మార్పులు చేయాల్సిందేనని, ఈ సీన్లలో ఆడియో, వీడియో కూడా ఉన్నాయని, దీనికి తోడు అక్షయ్ కుమార్ వేసిన శివుడి పాత్రలో కూడా మార్పులు చేయాలని సూచించింది. ఈ సినిమాలో శివుడి రూపం వేరుగా ఉండడంతో శివుడి దూతగా చూపించాలని నిబంధన పెట్టింది. ఇన్ని మార్పులు చేర్పులు చేయడంతో ఈ మూవీ విడుదల ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ కూడా జారీ ఇచ్చింది.

    ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ లీడ్ రోల్స్ నటించారు. చివరికి ఓ మై గాడ్-2 యూనిట్ సెన్సార్ బోర్డ్ చెప్పిన మార్పులు చేస్తారా? లేక మరోసారి బోర్డు పరిశీలించాలని అభ్యర్థిస్తారా అనే విషయం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Nagababu vs Allu arjun : అల్లు అర్జున్ కు నాగబాబు వార్నింగ్

    Nagababu vs Allu arjun : మెగా బ్రదర్ , జనసేన...

    Sajjala Bhargava Reddy : సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు..

    Sajjala Bhargava Reddy : వైఎస్ఆర్ సీపీ సోషల్‌ మీడియా మాజీ...

    Prabhas : ప్రభాస్ పక్కన హీరోయిన్.. జస్ట్ 20 లక్షలే.. మరో సినిమా చేయడానికి లేదు

    Prabhas Heroine : ప్రభాస్ ఇటీవల తన కొత్త సినిమా ఫౌజీని ప్రకటించిన...

    Shobhita Dhulipalla : నాగచైతన్యకు అందుకే పడిపోయా : శోభిత దూళిపాళ్ల

    Shobhita Dhulipalla : నాగచైతన్యలోని కూల్ అండ్ కామ్ నెస్ చూసే అతడి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related