star hero : మలయాళంలో తనో పెద్ద స్టార్ హీరో. మాలీవుడ్‌లో రికార్డులు సృష్టించాలన్నా.. ఉన్న రికార్డులను బద్దలు కొట్టాలన్నా అందరూ ఆయనను ఫాలో అవుతారు. వందల సినిమాలు తీసి వేల కోట్ల ఆస్తులు కూడబెట్టాడు. తన కొడుకుని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందించాడు. కానీ ఆ వారసుడు ఇప్పుడు కూలీగా మారాడు. తండ్రి సంపాదించిన వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆ కొడుకు పేరు ప్రణవ్ మోహన్ కల్యాణ్. అతని తండ్రి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. మోహన్ లాల్ కొడుకు కూలీ పని చేస్తున్నాడని విని షాక్ అవుతున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే..
మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత స్క్రీన్‌ప్లే రైటర్‌గా మారారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ హీరోగా వెండితెరపై మెరిశాడు. ఆయన నటించిన ‘హృదయం’ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆయన నటించిన ‘వర్షంగళ్కు శేషం’ కూడా ప్రణవ్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. హీరో కాకముందు చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఒకవైపు నటనతో పాటు అన్ని రంగాల్లోనూ మంచి పట్టు సాధించి ‘ఆల్ రౌండర్’గా పేరు తెచ్చుకున్నాడు ప్రణవ్. ఇలా కెరీర్ సాగిస్తున్న ప్రణవ్ ఒక్కసారిగా కాస్త గ్యాప్ తీసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ‘వర్షంగళ్కు శేషం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని స్పెయిన్ వెళ్లాడు ప్రణవ్. స్టార్ హీరో కావడంతో ప్రణవ్ ఎలాంటి పెళ్లి కోసమో, ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లలేదు. స్పెయిన్‌కు వెళ్లి కూలి పని చేశాడు. అతను అక్కడ ఒక ఫామ్‌హౌస్‌లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా చేరాడని చెబుతున్నారు. దీనికి జీతం లేదు. వారు అతనికి ఆహారం, ఆశ్రయం మాత్రమే ఇస్తారు.
ప్రణవ్ కూలి పని చేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేసినా.. తండ్రి మోహన్ లాల్ సంపాదించిన ఆస్తితో జీవితాంతం కూర్చొని తినవచ్చు. అలా ఉండకూడదనుకున్నా.. మంచి టాలెంట్ ఉంది. హీరోగా కూడా రాణించాడు. కేవలం నటనతోనే కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఇంత విలాసవంతమైన జీవితాన్ని వదిలి కూలి పని చేయాల్సిన అవసరం ఏముంది? అదేంటంటే.. ప్రణవ్ కి అలాంటి పని చేయడం ఇష్టం. అతను గొర్రెలు, గుర్రాలను చూసుకోవడంలో ఆనందాన్ని పొందుతాడు. ఈ విషయాన్ని ప్రణవ్ తల్లి మోహన్ లాల్ భార్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్రణవ్‌కి కష్టపడి పని చేయడం ఇష్టం. కానీ ప్రణవ్ హీరోగా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’ అని ప్రణవ్ తల్లి అన్నారు. రంగుల ప్రపంచం నుంచి వచ్చిన వ్యక్తి ఇంత సాదాసీదా జీవితాన్ని గడపడం నిజంగా గొప్ప విషయం.