
Yami Gautam : ముఖ్యంగా నేటితరం సెలెబ్రిటీలు కొద్దిగా ఫేమ్ రాగానే పూర్తిగా లైఫ్ స్టైల్ నే మార్చేస్తారు.. మరి ఈ సెలెబ్రిటీల వివరాలను తెలుసుకోవాలని నెటిజెన్స్ కూడా తెగ ఆసక్తి కనబరుస్తారు.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు వారు అభిమానించే నటీనటుల వివరాలను తెగ సర్చింగ్ చేస్తున్నారు.. అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చిన నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి..
వీరు నివసించే ఇంటి దగ్గర నుండి సెలెబ్రిటీలు వాడే వస్తువుల గురించి ఏదొక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. వాటిలో వారి కార్ల కలెక్షన్ కూడా ఉంటుంది. మరి ఈ మధ్య ఒక్కో స్టార్ ఒక్కో ఖరీదైన లగ్జరీ కార్లను కొంటున్నారు. ఖరీదైన కార్లను కేవలం సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, బడా బిజినెస్ మ్యాన్ లు మాత్రమే వాడుతారు..
వారికీ మాత్రమే ఈ ఖరీదైన కార్లను మైంటైన్ చేసే టాలెంట్ ఉంటుంది. ఇటీవలే మహేష్ బాబు ఐదున్నర కోట్ల ఖరీదైన కారును కొనగా ఈ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ లగ్జరీ కారు కొన్నట్టు తెలుస్తుంది.. బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ యామీ గౌతమ్ కూడా లగ్జరీ కారు కొన్నట్టు ఫోటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ భామ హిందీతో పాటు కన్నడ, మలయాళ, పంజాబీ, తమిళ్ భాషల్లో కూడా నటించి నటనతో మెప్పించింది. అయితే తెలుగు ఈమె చేసిన సినిమాలు హిట్ అవ్వక పోవడంతో మళ్ళీ బాలీవుడ్ వెళ్ళిపోయింది. 2021లో డైరెక్టర్ ఆదిత్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయినా వరుస సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.
ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా బిఎండబ్ల్యూ ఎక్స్7 కొనుగోలు చేసింది. ఈ కార్లను విక్రయించే సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలపడంతో ఈ వార్త వైరల్ అయ్యింది. యామీ గౌతమ్ ఆమె భర్త తమ కొత్త లగ్జరీ కారుతో స్టైలిష్ పిక్ దిగారు. ఈ పిక్ వైరల్ అవుతుంది.. ఇక ఈ కారు ధర అక్షరాలా 1.24 కోట్లని సమాచారం.. అంతకు ముందు ఈమెకు మరో ఖరీదైన రెండు కార్లు ఉండగా ఇప్పుడు మూడవ కారు తన గ్యారేజ్ లో చేరిపోయింది.
|
ReplyForward
|






