
Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సాధారణ కార్యకర్తగా ప్రారంభించిన ఆయన, చివరకు సెంట్రల్ మిలటరీ కమిషన్ కార్యదర్శిగా ఎదిగారు. దేశవ్యాప్తంగా అనేక ఆపరేషన్లకు ఆయనే సూత్రధారి.
2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తిరుమల సమీపంలో అలిపిరి వద్ద జరిగిన క్లైమోర్ మైన్ల దాడికి కేశవరావే సూత్రధారి. అయితే చంద్రబాబు బుల్లెట్‌ప్రూఫ్ కారులో ఉండటంతో ఆయన ప్రాణాలు తప్పాయి.ఇక 2008లో బలిమెల దాడిలో 36 మంది గ్రేహౌండ్స్ కమాండోలు, 2010లో దంతేవాడలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణాలు, 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యలు వంటి ఘటనల వెనుక కేశవరావే ఉన్నారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ హత్య కూడా ఆయన ప్రణాళికలో భాగమే.
కేశవరావుపై చివరికి రూ.2.02 కోట్ల రివార్డు ఉండగా, ఆయన్ని ఎదుర్కొన్న సెక్యూరిటీ ఫోర్సెస్ ఎన్కౌంటర్‌లో చంపారు.