Tiger Viral Video : సమస్త జీవకోటి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉంటుందనేది కాదనలేని సత్యం. అది ఏ జీవి సొత్తు కాదు. ప్రకృతి నియమాలకు కట్టుబడే ప్రతీ జీవి గమనం సాగిస్తుంది. కానీ ఒక్క మానిషి మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తూ ప్రకృతి వినాశనానికి కారణం అవుతూ జీవకోటి మనుగడకు తీవ్ర ముప్పు తెస్తున్నాడు. ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసినా పట్టించుకునే వారు మాత్రం ఎవ్వరూ ఉండరు.
పర్యావరణ పరిరక్షణ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇది ప్రమాదమని తెలిసినా కూడా అలాగే చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని సార్లు జంతువులు మనకు కనువిప్పు కలిగిస్తున్నాయి. అయినా కూడా వాటిని పట్టించుకుంటామా? అనేది ఆలోచించాలి. ఇలాంటి ఘటనలు కొందరు జంతు ప్రేమికులు తమ కెమెరాల్లో బంధిస్తారు. తాజాగా ఓ పులి చేసిన పని మానవాళిని ఆలోచింప చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో వైరల్ గా మారింది. పులి చేసిన పనికి ప్రతీ ఒక్కరూ అవాక్కవుతున్నారు.
పులి, సింహం లాంటి జంతువులు క్రూర మృగాలని మనకు తెలిసిందే కదా.. కానీ వాటిలో కూడా పర్యావరణ స్పృహ ఉంటుంది. కొన్ని సార్లు అవి చేసే పనులు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఓ పులి విచిత్రమైన పని చేసి త ద్వారా మానవాళికి సందేశం ఇచ్చింది. అసలు అది ఏం చేసిందో తెలుసుకుందాం.
ఒక పులి నీటి వద్దకు నడుస్తూ వెళ్లింది. దాహం తీర్చుకునేందుకు అని అంతా అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన పులి నీటిలో తేలియాడుతున్న ప్లాస్టిక్ బాటిల్ ను నోట కరుచుకొని బయటకు తీసింది. దాన్ని ఏం చేస్తుందా? అన్న ఆతృత అందరికీ ఉండగా.. ఆ బాటిల్ తో కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి అక్కడ పడవేసింది. వేటాడాల్సిన పులి.. దీనికి విరుద్ధంగా ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను నీటి నుంచి తొలగించడం అదరినీ తలదించుకునేలా చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘అరే! ఈ పులి చాలా విచిత్రంగా ఉందే’.. అంటూ కొందరు, ‘పులిని చూసి చాలా నేర్చుకోవాలి’.. అని మరికొందరు.. ఈ వీడియో 93 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Why should the wild clean the garbage of the (un)civilised 😞😞
Please stop carrying plastics & styrofoams into the wilderness🙏(Credit it the clip) pic.twitter.com/fSTekEYe5f
— Susanta Nanda (@susantananda3) February 14, 2024