
Purify the blood : మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. అది ప్రతి గంటకోసారి మన కిడ్నీలు ఫిల్టర్ చేస్తుంటాయి. అలా రక్తం శుభ్రం చేసుకుంటూ శరీరంలోని భాగాలకు సరఫరా అవుతుంది. దీంతో మన అవయవాలు పనిచేస్తాయి. రక్తం శుభ్రంగా లేకపోతే మన శరీరం సహకరించదు. జరగాల్సిన పనులు వాయిదా పడతాయి. దీంతో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. రక్తాన్ని శుద్ధి చేసుకునేందకు కొన్ని చర్యలు తీసుకుంటే సరి.
రక్తాన్ని శుభ్రం చేయడంలో వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. తులసి కూడా చాలా మేలు చేస్తుంది. వెల్లుల్లి తింటే రక్తంలో ఉండే మలినాలను దూరం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. తులసిలో ఉండే ఆక్సిజన్ కారణంగా రక్తం శుద్ధి అవుతుంది. ఇందులో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
వేప పసుపు కూడా రక్తాన్ని శుభ్రం చేస్తాయి. వేప ఆకుల్ని నమిలి తినడం ద్వారా శరీరం డీటాక్స్ అవుతుంది. పసుపు కూడా మన రక్తాన్ని శుభ్రం చేయడంలో సాయపడుతుంది. ఏదైనా గాయం అయినప్పుడు పసుపు రాస్తాం. దీంతో రక్తం కారడం ఆగుతుంది. ఇలా పసుపు కూడా రక్తాన్నిశుభ్రపరుస్తుంది.
రక్తాన్ని శుభ్రం చేయడంలో బీట్ రూట్, బెల్లం కూడా ఉపయోగపడతాయి. బీట్ రూట్ లో ఉండే బీటా నయామిన్ రక్తాన్ని శుభ్రం చేయడంలో సాయపడుతుంది. ఇక బెల్లం కూడా రక్తాన్ని క్లీన్ చేస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉండటంతో రక్తాన్ని శుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా రక్తాన్ని శుద్ధి చేసేందుకు పలు రకాల పదార్థాలు దోహదపడతాయి.