R Thyagarajan : శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్. త్యాగరాజన్. అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తి. ఆయనకు మొబైల్ ఫోన్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. వేల కోట్ల వ్యాపారం నిర్వహించే సాధారణ వ్యక్తి. అసాధారణ వ్యాపారం చేస్తున్నా ఆయన సాధారణ పౌరుడిలాగే ఉంటారు. రూ. లక్ష తో ప్రారంభమైన శ్రీరామ్ చిట్స్ నేడు లక్షల కోట్ల వ్యాపారానికి ఎదిగింది. అదంతా ఆయన చలవే. దీంతో ఆయన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది.
చిన్న చిట్ ఫండ్ కంపెనీ స్థాపింి దాన్ని మిలియన్ డాలర్ కంపెనీగా మలిచిన వ్యక్తి నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతున్నారంటే నమ్ముతారా? ఓ చిన్న ఇంట్లో కనీసం మొబైల్ కూడా లేకుండా ఆయన జీవితం అత్యంత సాధారణంగా గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయనే శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్. త్యాగరాజన్. ఓ చిన్న ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు. ఆయన స్థాయికి పెద్ద భవంతి కట్టుకోవచ్చు. కానీ ఆయన అలా చేయరు. సాధారణమైన జీవితానికి ప్రాధాన్యం ఇస్తారు.
ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చినా సున్నితంగా తిరస్కరించారు. ఇరవై నాలుగు గంటలు తన కార్యాలయంలోనే ఉంటారు. వ్యాపారం ఎలా సాగుతుందని అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు. అన్ని కోట్లున్నాయి కదాని నిర్లక్ష్యం చేయరు. ప్రతి పని ఎంతో శ్రద్ధగా చేసుకుంటారు. ఏ పని అయినా తానే స్వయంగా చేసుకుంటారు. రూ.6 వేల కోట్లున్నా ఆయన జీవితం ఆడంబరాలకు పోవడం లేదు. సాధారణ వ్య్తక్తిలాగే ఉంటారు. అదే ఆయన ప్రత్యేకత.
తానో పెద్ద అధిపతి అనే ఉద్దేశం ఉండదు. సామాన్యుడిగానే భావిస్తుంటారు. తానో ఉద్యోగిగానే మసలుకుంటారు. కంపెనీ పురోగమనంలో తనదైన పాత్ర పోషిస్తారు. తాను కలలు కన్న కంపెనీ కోసం నిరంతరం శ్రమిస్తారు. అత్యంత సాధారణ వ్యక్తిలాగే ఉంటారు. ప్రస్తుత కాలంలో చిన్న స్థాయికే ఎంతో పెద్ద హోదా గల వ్యక్తిగా గొప్పలకు పోయే కాలంలో ఆయన కనీసం మొబైల్ కూడా వాడకుండా ఉన్నారంటే ఆయన సింపుల్ సిటీ ఏంటో అర్థమవుతుంది.