The Tamarind Tree: 1908లో మూసీ ప్రకోపించింది. ఉగ్రరూపం దాల్చింది. ఈ వరదల్లో దాదాపు 15 వేల మందికి పైగా మరణించారు. ఎక్కడ చూసినా హాహా కారాలు.. ఆర్థనాదాలు. హైదరాబాద్ మొత్తం విలపించింది. ఇంతటి బీభత్సం సృష్టించిన మూసీ వరదలను ఎదురుగా నిలబడింది ఒక చెట్టు ఎదురొడ్డి నిలబడడమే కాదు.. ఏకంగా 150 మందికి పైగా కాపాడింది. మూసీ ప్రకోపానికి కాస్తంత కూడా జంకలేదు. ఇప్పటికీ ఆ చెట్టు సజీవంగానే ఉంది. 116 సంవత్సరాలు అయినా ఆ చెట్టు కాయలను కాస్తూనే ఉంది. హైదరాబాద్ లోని వివిధ పాఠశాలలకు చెందిన పిల్లలు, మేధావులు, చరి త్రకారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఆ చెట్టును, దాని చుట్టూ ఉన్న జ్ఞపకాలను నెమరువేసుకున్నారు. మూసీ వరదలు వచ్చి సరిగ్గా 116 సంవత్సరాలు కావడంతో శనివారం (సెప్టెంబర్ 28) గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న చింత చెట్టు వద్ద సంస్మరణ, సంఘీభావ సభలు నిర్వహిస్తుంటారు. వందలకు పైగా సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ అక్కడ ఏటా నివాళి కొనసాగుతూనే ఉంటుంది. ఇది కూడా చాలా గొప్ప విషయమే.
Breaking News