Teej Mahotsav : భారతదేశంలోని రాజస్థాన్ మూలాలను కలిగి ఉన్న వారు. రాజస్థాన్‌లో చదువుకున్న, రాజస్థాన్‌లో జన్మించిన, రాజస్థానీని వివాహం చేసుకున్న వారి కోసం అమెరికాలో ఏర్పాటు చేసిన సంస్థ ‘రాజస్థానీ ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ రెసిడెన్స్’. ఈ సంస్థ 2017 నుంచి తమ సేవలను అందిస్తోంది.
కులం, మతం, ఆదాయం, జననం, సామాజిక హోదాలో ఉన్న రాజస్థానీలందరినీ ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చి, వారిలో రాజస్థానీ ప్రైడ్‌ను స్థాపించడానికి ఆర్గనైజేషన్ కృషి చేస్తుంది.
ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రవాసుల కోసం తీజ్, గంగౌర్, దీపావళి, హోలీ లాంటి రాజస్థానీ పండుగలను అమెరికాలో ఆర్గనైజేషన్ వైభవంగా నిర్వహిస్తుంది. వివిధ ఫోరమ్‌లలో రాజస్థాని, దాని సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అమెరికాలో నివసిస్తున్న రాజస్థానీయుల సమస్యలపై ప్రభుత్వం, అధికారులతో మాట్లాడుతుంది.
ప్రవాసుల కోసం IT శిక్షణ, ఆరోగ్య అవగాహన సెషన్లు నిర్వహిస్తుంది. గ్రామీణ రాజస్థాన్‌లో నివసిస్తున్న రాజస్థానీలకు విద్య మరియు వృత్తి శిక్షణ ఇవ్వడంలో సాయం చేస్తుంది.
రాజస్థానీ ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ రెసిడెన్స్ ఆధ్వర్యంలో ‘తీజ్ మహోత్సవం 2024’ నిర్వహించింది. ఈ ఉత్సవం ఆగస్ట్ 9వ తేదీ (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు న్యూ జెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో వైభవంగా జరిగాయి. ఖుదా భక్షి ఆధ్వర్యంలో లైవ్ పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేశారు.
దీంతో పాటు టీన్ రాజస్థాన్, మిస్ రాజస్థాన్, మిస్టర్ రాజస్థాన్ పోటీలు నిర్వహించి విజేతలకు కీరీటాలు అలంకరించారు.
ఇంకా ఈ వెంట్ లో క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, సాంగ్స్, మ్యూజిక్స్, గూమర్, లైవ్ కాన్సర్ట్, తదితరాలు నిర్వహించారు. ఇంకా ఫుడ్ కూడా అందించినట్లు ఆర్గనైజేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కు పెద్ద ఎత్తున స్పందన లభించింది.
అధిక సంఖ్యలో రాజస్థానీలు హాజరయ్యారని కార్యక్రమం ఆనందంగా, ఉల్లాసంగా సాగిందని తెలిపారు.
More Images : Teej Mahotsav 2024 Rajasthan 8th Annual Celebrations