underwear typhoon : పొరుగు దేశం చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకో తెలియదు గానీ వింతలన్నీ ఆ దేశంలోనే జరుగుతాయి. అలాంటి కొత్త వింత సంఘటన మరొకటి జరిగింది. దేశంలో అండర్ వేర్ తుపాను ఏర్పడింది. దీనిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. తుపాను కారణంగా భారీ మొత్తంలో లోదుస్తులు ఆకాశంలో ఎగిరిపోయాయి. ఎగిరిపోతున్న లోదుస్తులను చూసి అక్కడి ప్రజలు షాక్ అయి చూస్తుండిపోయారు. లోదుస్తుల తుఫాను వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్కడ బలమైన గాలులకు ప్రజల బట్టలు ఎగిరిపోయాయి. సెప్టెంబర్ 2న ప్రజల లోదుస్తులు వారి బాల్కనీల నుండి ఎగిరిపోయాయి. ప్రస్తుతం చైనాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు వానలు పడాలని ప్రార్థిస్తున్నారు. అయితే ఈసారి వర్షాలనికి బదులు ఆకాశం నుంచి లోదుస్తులు వానలా పడ్డాయి. ఈ వింత దృశ్యాన్ని చూసి అక్కడున్న జనం అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సంఘటన సెప్టెంబరు 2 న చైనాలోని చాంగ్‌కింగ్‌లో జరిగింది. తుఫాన్ కారణంగా గాలి వీచడం వల్ల అండర్ వేర్ కుప్పలు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. చైనాలోని చాంగ్‌కింగ్ నగరంలో ఎండల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండడంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వేడి వాతావరణం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అధికారులు కృత్రిమ వర్షాలు కురిపించాలని అధికారులు నిర్ణయించారు. ఆ సమయంలోనే ఈదురు గాలులు వీచడంతో ఇళ్లలోని బాల్కనీలో ఆరబెట్టేందుకు ప్రజలు ఉంచిన బట్టలు, బరువైన లోదుస్తులు ఎగిరిపోయాయి. అండర్ వేర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆకాశంలో లోదుస్తులు మాత్రమే కనిపించాయి. దీని తర్వాత, చైనా ప్రజలు ఈ సంఘటనకు “9/2 చాంగ్‌కింగ్ అండర్‌వేర్ సంక్షోభం’ అని పేరు పెట్టారు. తుపాను క్లౌడ్ సీడింగ్ వల్ల సంభవించలేదని, సహజసిద్ధంగా సంభవించిందని ఘటన అనంతరం అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో NoToEvils అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఈదురుగాలుల కారణంగా ఎక్కడ చూసినా అండర్ వేర్లు ఎగిరిపోతున్నాయి. ఈ సీన్ చూసిన నెటిజన్లు ఫుల్ షాక్ అవుతున్నారు.