Teacher Posts : నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్.. లక్షా 78 వేల టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి.. ఏ రాష్ట్రం వారైనా అర్హులే.. ఇక దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్కడనుకుంటున్నారా.. బిహార్ ప్రభుత్వం ఈ మేరకు గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం జరిగి క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించింది. గతంలో స్థానిక అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండేది. అయితే ఈ సారి ఇతర రాష్ర్టాల వారికి కూడా అవకాశం కల్పిస్తూ బిహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అర్హత కలిగిన భారత పౌరులు ఎవరైనా 1.78 లక్షల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చునని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో వీటిని భర్తీ చేయనున్నారు. ఇందులో 85,477 ప్రైమరీ టీచర్లు, 1745 మాధ్యమిక టీచర్లు, 90,804 హైస్కూల్ టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
వయసు పరిమితి:
1వ తరగతి నుంచి 5వ తరగతి టీచర్లకు 18 ఏళ్లు
9వ తరగతి నుంచి 10వ తరగతి, 11వ వ తరగతి నుంచి 12వ తరగతి టీచర్లకు : 21 ఏళ్లు
అన్ రిజర్వ్ పురుష అభ్యర్థులకు: 37 ఏళ్లు
అన్ రిజర్వ్ మహిళా అభ్యర్థులకు: 40 ఏళ్లు
బీసీ, ఈబీసీ, అభ్యర్థులు: 40 ఏళ్లు
ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు: 42 ఏళ్లు
జీతభత్యాలు..
ప్రైమరీ టీచర్ మూల వేతనం: రూ.25 వేలు
సెకండరీ టీచర్ మూల వేతనం: రూ.31 వేలు
11వ, 12వ తరగతి టీచర్ మూల వేతనం: రూ.32 వేలు
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, బెంట్ ఆధారంగా ఉంటుంది.
పరీక్షల తేదీ: ఆగష్టు 24 నుంచి ఆగస్టు 27 వరకు
దరఖాసు చివరి తేదీ: 12/07/12023
పరీక్ష ఫీజు : జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ.750
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ. 200
మహిళలకు: రూ.200