Chandrayaan 3 :
విమానయానం ప్రతి ఒక్కరికీ ఒక అద్భుత ప్రయాణం.. అయితే ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఒక అద్భుత వీడియోను తీశాడు. ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఇండిగో విమానం ఒకటి చెన్నై నుంచి ఢాకాకు వెళ్తోంది. యాదృచ్ఛికంగా అదే సమమంలో శ్రీహరికోట లో చంద్రయాన్-3 ప్రయోగం జరుగుతున్నది. అప్పుడే నింగిలోకి దూసుకెళ్తున్న చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించిన చారిత్రాత్మక ఘట్టానికి ప్రయాణికులు సాక్షులు అయ్యారు. అందరూ విండో సీటు నుంచి ఆ అద్బుతాన్ని వీక్షించారు. అయితే ఇందులో ఓ ప్రయాణీకుడు తన మొబైల్‌లో వీడియోను రికార్డ్ చేశాడు. ఇప్పుడు ఇదే అద్భుతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతరిక్షం నుంచి అంతరిక్ష నౌక యొక్క మొట్టమొదటి అమెచ్యూర్ వీడియో ఇదే. ఈ వీడియోను ఇస్రో మెటీరియల్స్ మరియు రాకెట్ తయారీ డైరెక్టర్ (రిటైర్డ్) డాక్టర్ పీవీ వెంకటకృష్ణన్ ట్వీట్ చేశారు. వాస్తవానికి, శ్రీహరికోట చుట్టుపక్కల ఉన్న గగనతలం ప్రయోగ సమయంలో నో ఫ్లై జోన్‌గా ఉండాలి. విమానం నో ఫ్లై జోన్ వెలుపల ఉంది. అయితే ఈ వీడియోను తీసిన ప్రయాణికుడిని అందరూ అభినందిస్తున్నారు.
అయితే చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమవడం భారతదేశమంతా సంబురాల్లో మునిగి తేలింది. ప్రపంచాన్ని నెవ్వరపరిచేలా ఈ ప్రయోగం సక్సెస్ కావడం భారతీయులను అబ్బుర పరిచింది. ప్రస్తుతం చంద్రయాన్ 3 కక్ష్యలోనే ఉందని, వచ్చే నెల మూడో వారానికల్లా ఇది చంద్రునిపైకి చేరుకుంటుందని మన శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.