Mumbai: హిందువులకు అతిపెద్ద పండుగ దేవీ నవరాత్రోత్సవాలు. దేశం యావత్తు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించుకునే ఈ పండుగను వివిధ ముఖ్య పట్టణాల్లో చూసేందుకు విదేశాల నుంచి కూడా లక్షలాది, కోట్లాది వస్తుంటారు. అయితే ఈ సారి ఈ పండగనే టార్గెట్ గా చేసుకున్న టెర్రరిస్టులు దాడులు తెగబడే అవకాశం ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పట్టణాల్లో భద్రతను పెంచారు. నవరాత్రోత్సవాలు ముగిసే వరకు భద్రతను అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతామని ఆయా పట్టణాల పోలీసులు చెప్తున్నారు. ముంబై నగరంలో ఈ భద్రత మరింత ఎక్కువగా ఉంది. ప్రతీ డీసీపీ ఆఫీస్ తమ జోన్లను జల్లెపడుతున్నారు. భద్రతతో పాటు అనుమానిత వ్యక్తులపై కన్నేస్తున్నారు. కొత్తగా వచ్చే వారు ఎవరు? ఎందుకువ వస్తున్నారు? తదితర విషయాలను ఆరా తీస్తున్నారు. ముంబై మొంత్తం తనిఖీలు, గస్తీల్లో పోలీసులు మునిగిపోయారు. నవరాత్రులు ముగిసే వరకు కూడా ఇలానే ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రతీ డీసీపీ జోన్ ఆఫీసుకు ఎస్పీ ఆఫీస్ నుంచి ఆదేశాలు అందాయి. పై అధికారుల ఆదేశాలతో డీసీపీలు వారి వారి కింద స్థాయి పోలీసులకు సూచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా నవరాత్రులు ముగిసే వరకు ముంబైలో భక్తి ఎంత ఉంటుందో భద్రత కూడా అంతే ఉండేలా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Breaking News