World దేశం అంటే ఇంత జనాభా ఉండాలన్న ప్రధాన నియమం ఏదీ లేదు. కానీ కోట్లలో లేదంటే లక్షల్లో జనాభా ఉంటారని అంతా అనుకుంటారు. కానీ అతి తక్కువ మంది పదుల సంఖ్యలో జనాభా కలిగిన దేశం ఒకటుందని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అతి పెద్ద దేశం చైనా అయితే అతి చిన్న దేశం వాటికన్ కంట్రీ అని చదువుకున్నాం.. చెప్తున్నాం కూడా కానీ వాటికన్ కంటే చిన్న దేశం ఉంది. దాని గురించి తెలుసుకుందాం. ఆ దేశం పేరు ‘సీలాండ్’ అట.
జనాభాను పక్కన పెడితే వాటికన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది కాబట్టి దాని గురించి అందరికీ తెలిసే ఉంటుంది కానీ సీలాండ్ గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. సీలాండ్ అధికారిక పేరు ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్ ఇది ఇంగ్లాండ్ కు కేవలం 10 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి జనభా కేవలం 27 మందేనట.
కంట్రీ విస్తీర్ణం కేవలం 550 చదరపు మీటర్లు. భారత్ లో కుగ్రామాల కన్నా విస్తీర్ణంలో చాలా చిన్నది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే దీనికి సొంత జెండా, సైన్యం, కరెన్సీ కూడా ఉంది. దీన్ని ఒక రాణి పరిపాలిస్తుంది. రెండో వరల్డ్ వార్ సమయంలో జర్మన్ దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇంగ్లండ్ ఈ దేశాన్ని ఉపయోగించుకుంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది.
రెండో వరల్డ్ వార్ సమయంలో బ్రిటిష్ వారు సీలాండ్ ను నిర్మించారు. దీన్ని నావికా కోట కోసం వాడుకున్నారు. 1943లో యూకే ప్రభుత్వం ఈ ప్రాంతంలో మౌన్ సెల్ కోటలను నిర్మించింది. జర్మన్ మిన్ క్రాఫ్ట్‌కు వ్యతిరేకంగా ప్రభావంతంగా ఉంది. ఈ కోటలు1956లో రద్దు చేశారు. 1967లో సీలాండ్ యజమాని ప్యాడీ రాయ్ బెట్స్ పైరేట్ రేడియో బ్రాడ్కాస్టర్ నుంచి తీసుకొని సార్వభౌమ దేశంగా ప్రకటించారు. 54 సంవత్సరాలుగా యూకే ప్రభుత్వానికి ఈ దేశం వ్యతిరేకంగా పనిచేస్తుంది. సీలాండ్ వివాదాస్పద మైక్రో నేషన్. సఫోల్క్ తీరానికి 12 కిలో మీటర్ల దూరంలో ఉంది.