Sobhita-chai : సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి కనిపించాడు. నా ప్రిడిక్షన్ ఎప్పుడూ తప్పు కాదని వాదించే ఆయనకు ఈ మధ్య పెద్ద దెబ్బ తగిలింది. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటానని చెప్పి మరీ మరో ప్రిడిక్షన్ తో వచ్చాడు. గతంలో సమంత-నాగ చైతన్య వివాహం విషయంలో ఆయన ఈ జంట ఎక్కువ రోజులు కలిసి ఉండబోదని చెప్పారు. ఆయన అన్నట్లుగానే వారు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే క్యూట్ కపుల్ అని ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకని అంతే వేగంగా విడిపోయారు. దీంతో ఆయన ప్రిడిక్షన్ అంటే మరింత నమ్మకం పెరగడం మొదలైంది. ఆయన ఏపీ ఎలక్షన్, అక్కడి ప్రభుత్వ తీరు గురించి ఇచ్చిన ప్రిడిక్షన్ గురించి కాస్త పక్కన పెడితే..
ఇప్పుడు శోభిత ధూళిపాళ-నాగ చైతన్య జాతకాలను పరిశీలించానని వాటి గురించి చెప్తూ.. శోభిత జాతక రీత్యా 2027లో వారి మధ్య కలతలు వస్తాయని, వారి వైవాహిక బంధంలో ఇబ్బందులు ఏర్పడుతాయని, వారి నిశ్చితార్థానికి పెట్టిన ముహూర్తం కూడా సరైనది కాదని, అఖిల్ విషయంలో కూడా అలాగే చెప్పాను. ఇప్పుడు కూడా మంచి కోసం చెప్తున్నాను. నా జాతకం ఫెయిల్ కావాలనే కోరుకుంటున్నానని చెప్పాడు.
సామ్-చై విషయంలో సమంతకు 50 మార్కులు వేశాను, కానీ శోభితకు 10 మార్కులు కూడా వేయలేను. ఇందులో కెరీర్ పరంగా చూసుకుంటే సామ్ కెరీర్ బాగుంది. కానీ శోభితది బాగాలేదు. చివరికి ఆయన చెప్పిందేంటంటే? వీరిద్దరూ ఎడబాటుకు గురవుతారని చెప్పుకచ్చాడు. వేణు స్వామి మరో సారి స్పందించడం.. అదీ చై జాతకంపై స్పందించడంపై ఇండస్ట్రీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కొత్త జంట కూడా 2027లో విడిపోతారని వేణుస్వామి చెప్పారు. శుభమాని ఎంగేజ్‌మెంట్ చేసుకుంటుంటే ఇలాంటి అశుభమైన మాటలు మాట్లాడడం సరైంది నకాదని, ఆయనను జాతకం చెప్పమని ఎవరు అడిగారని? నెటిజన్లు సైతం కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram