
Ban on meat : మనం సాధారణంగా మాంసాహారం తింటాం. ఆదివారం వచ్చిందంటే చాలు అందరు చికెన్, మటన్ లాగించడం అలవాటే. ఈ నేపథ్యంలో మాంసాహారం అంటే అందరికి ప్రీతికరమే. జిహ్వ చాపల్యం చంపుకోలేక మాంసం తింటుంటారు. మనకు పూర్వ కాలం నుంచి మాంసాహారం తినడం ఓ సంప్రదాయంగానే మారింది. మాంసం ప్రియులు దాన్ని తినకుండా ఉండలేరు.
ఈ నేపథ్యంలో సిక్కి ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది రాష్ర్టంలో మే 27 నుంచి జూన్ 4 వరకు మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఉల్లంఘిస్తే రూ. వెయ్యి జరిమానా విధించేందుకు కూడా సిద్ధమైంది. మాంసాహారులకు కష్టాలు ఎదురవుతున్నాయి. తమ నాలుకలను చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
పెళ్లి వేడుకలు, ఇతర విందులు ఏర్పాటు చేసుకుని మాంసం పెట్టాలనుకుంటే ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. బౌద్ధ క్యాలెండర్ ప్రకారం అక్కడ సాగ దవా అనే పవిత్ర మాసం కావడం వల్ల మాంసం విక్రయాలు నిలిపివేసినట్లు చెబుతున్నారు. ఈ క్యాలెండర్ ప్రకారం టిబెట్ ప్రజలు అనుసరిస్తారు. చేపల విక్రయాలకు మాత్రం మినహాయింపు ఉండటం గమనార్హం.
మాంసం విక్రయాలు నాలుగు రోజులు నిషేధాలు జారీ చేయడంతో ప్రజలు తమ జిహ్వ చాపల్యాన్ని చంపుకుంటున్నారు. బౌద్ధ మత ఆచారాల ప్రకారం నడుచుకోవడానికే అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈశాన్య రాష్ట్రాలకు టిబెట్ తో అనుబంధం ఏర్పడినందున అక్కడి ఆచారాలు పాటించడం కొత్తేమీ కాదు. కాకపోతే మాంసాహార ప్రియులకు తమ నోళ్లకు రుచి తగలక ఇబ్బందులు పడుతున్నారు.






