alcohol door Delivery : మద్యం షాపుకు వెళ్లాలి.. ఇప్పుడు మందు బాబుల సంఖ్య పెరిగింది కాబట్టి ఎంతో కొంత క్యూలో నిల్చోవాలి.. ఇక మందు కొన్న తర్వాత మంచింగ్ (మందులో నంచుకునేది) తీసుకోవాలి. ప్లేస్ దొరుకుతుందా..? నిలబడే లాగించేయాలా..? మళ్లీ ఇదో కన్ఫ్యూజన్. అదే ఇళ్లు అయితే.. దర్జాగా కూర్చోని కాలు మీద కాలేసుకొని సహకరిస్తే వైఫ్ ఆమ్లేటో.. లేదంటే చికెన్ మంచురీయానో.. లేదంటే ఇంకేదో చేసి పెడుతుంది సంబురంగ తాగచ్చు. ఇక ఎలాగో ఇంట్లోనే తాగుతున్నాడు కాబట్టి కట్టడి చేయవచ్చు.. బయటకు వెళ్లి వెతుక్కొని రావాల్సిన అవసరం కూడా ఉండదు.. కంగారు పడే పనిలేదని భార్య కూడా అనుకుంటుంది. దీని కోసమే ఒక వైన్ షాపు నిర్వాహకుడు డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. మద్యంను డోర్ డెలివరీ చేస్తానని చెప్పాడు. ఇది బాగానే ఉన్నా.. ఈ కాన్సెప్ట్ మాత్రం కొందరిని (ప్రతిపక్షాలను) ఆగ్రహానికి గురి చేస్తుంది. మా ప్రభుత్వం (వైసీపీ)లో సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్తే.. ఈ ప్రభుత్వం ఇంటింటికీ మద్యం డెలివరీ చేసే స్థితికి వచ్చిందని మండిపడుతున్నారు. ‘మద్యం డోర్ డెలివరీ’ అంటూ వచ్చిన కథనంపై ఇన్ స్టా రీల్స్ ఆలోచింప జేస్తున్నాయి. హోమ్ డెలివరీ బెస్టా లేదంటే.. సంక్షేమ పథకాలను మాని ఇలాంటి డోర్ డెలివరీలను ఎంకరేజ్ చేస్తారా? అనేది ప్రజలే ఆలోచించుకోవాలి.
Breaking News
Alcohol : అక్కడ మద్యం డోర్ డెలివరీ అంట.. సంబురాల్లో మందుబాబులు..
Date: