Biggboss 7 : అతి త్వరలోనే స్టార్ట్ కాబోతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ”బిగ్ బాస్ సీజన్ 7” కోసం ఫ్యాన్స్ అంత ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. బిగ్ బాస్ అనగానే కొత్త కొత్త టాస్క్ లతో కాంట్రవర్సీ లతో ఒకరిపై ఒకరు కామెంట్స్ తో రచ్చ రచ్చ చేయడం ఖాయం.. అందుకే బిగ్ బాస్ షో ప్రేక్షకులను టీవీ లకు అతుక్కుపోయేలా చేస్తుంది..
ఇప్పటికే ఈ షో అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అంటూ ప్రోమోలు రిలీజ్ చేసారు. ఇక కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పుడు ఎలా నెట్టింట కంటెస్టెంట్స్ గురించి హాట్ టాపిక్ అవుతుందో ఈసారి కూడా అలాగే ఉంది. ఈసారి ఈ షోలో సందడి చేయబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో న్యూస్ వైరల్ అవుతుంది..
ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్ గా చేయనున్న ఈ సీజన్ లో ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో సామాన్యుడిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ ఒక కంటెస్టెంట్ గా ఎంపిక అయినట్టు టాక్.. ఇతడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి.. మరి అలాగే ఇంకొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి..
మొగలిరేకులు సీరియల్ తో ఫేమస్ అయిన ఆర్కే నాయుడు ఉండనున్నారు అని ఈయన రెమ్యునరేషన్ 80 వేల వరకు ఉంటుందని సమాచారం.. అలాగే జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్, సింగర్ మోహన భోగరాజు, కొరియోగ్రాఫర్ ఢీ పండు, ఈటీవీ ప్రభాకర్, కార్తీక దీపం మోనిత అలియాస్ శోభా శెట్టితో పాటు విష్ణుప్రియ, వైష్ణవి చైతన్య, నవ్య స్వామి, సురేఖ వాణి, టిక్ టాక్ తో ఫేమస్ అయిన కపుల్ దుర్గారావు-ఆయన సతీమణి పాల్గొనబోతున్నట్టు కన్ఫర్మ్ అవుతుంది.