Chanakya Sutras : నేటి కాలంలో వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే నమ్మకం ముఖ్యం. దీంతో పాటు ఇద్దరి మధ్య సమన్వయం ఉండాలి. ఇప్పటికే పెళ్లి చేసుకున్న వారు పెళ్లి చేసుకోవాలని అనుకునే వారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేసే చిన్న తప్పులే జీవితంపై ప్రభావం చూపుతాయి. పెళ్లి జీవితం బలంగా ఉండాలంటే చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు పాటించాలి. దీంతో దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు.
భార్యా భర్తల మధ్య గోప్యత అనేది ఇంపార్టెంట్. పడక గదిలో జరిగే చాలా విషయాలు బయట పెట్టుకోకూడదు. ఇందులో మూడో వ్యక్తికి చాన్స్ అస్సలు ఇవ్వకూడదు. ఒక వేళ మూడో వ్యక్తికి చాన్స్ ఇస్తే మీ జీవితం నాశనం అవుతుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం కూడా పోతుంది. అనవసరమైన విషయాలు అడ్డు వచ్చి అపార్థాలు పెరిగిపోతాయి.
భార్యాభర్తల మధ్య సంబంధం అంటే నిజాయతీ ముఖ్యం. అబద్ధాలతో ఎక్కువ కాలం నిలవలేరు. ఎందుకంటే అలాంటి బంధాలకు విలువ ఉండదు. ఎక్కవ కాలం నిలవదు. అబద్ధాల నిర్మాణంతో మొదలయ్యేవి అబద్ధాలతో నాశనం అవుతాయి. అబద్ధం అనేది విషంతో సమానం అని దాన్ని అనుసరించి కొత్త చిక్కులు తెచ్చి పెట్టుకోకూడదని చాణిక్యుడు చెప్పాడు.
గతంలో భర్త ఒక్కడే పని చేసేవాడు. భార్యలు ఇంటికే పరిమితమయ్యేవారు. ప్రస్తుత కాలంలో స్త్రీ, పురుషులు ఇద్దరు జాబ్ లు చేస్తున్నారు. సంపాదిస్తున్నారు. కాబట్టి డబ్బుకు ప్రాధాన్యం ఇస్తూనే పరస్పరం ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ఖర్చు, పొదుపు లాంటి విషయాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఒకరి సంపాదన మీద మరొకరు ఆధారపడకుండా ఒకరి డబ్బులు పొదుపు చేసి మరొకరి డబ్బులను ఖర్చుకు వినియోగించాలి. ఇలా ఐక్యత పెరుగుతుంది. డబ్బులోనే కాదు.. బంధువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పలకరింపులు విషయంలో పొట్లాటలకు పోరాదు. బంధువులు వచ్చి వెళ్లేవారు. దంపతులు కలిసి మెలిసి జీవితాంతం ఉండేవారు.