38 C
India
Saturday, June 6, 2026
More

    Nagarjuna : నాగార్జున కెరీర్ ను అమాంతం పైకి తీసుకెళ్లిన అయిదు మూవీలు ఇవే.. ఓ సారి లుక్కేద్దాం

    Date:

    Nagarjuna
    Nagarjuna

    Nagarjuna : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున రూటే సెపరేటు.. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆ తర్వాత తన కంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు. తెలుగులో టాప్ హిరోలుగా చిరంజీవి, బాలకృష్ణ సరసన నాగార్జున నిలిచాడు. తెలుగులో అగ్ర హిరోలు అనగానే నాగార్జున పేరు చెప్పక తప్పదు.

    శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీని శాసించిన నాగార్జున టాప్ లిస్టులోని ఎంటర్ అయ్యాడు. శివ సినిమా తెలుగులో మాస్ సినిమాలకు ఆజ్యం పోసిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాతనే నాగార్జున తో మాస్ సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ముందుకు వచ్చారు. అంతకుముందు నాగార్జున ఎప్పుడు రొమాంటిక్ సినిమాలు చేస్తూ ఉండేవాడు. శివ సినిమాకు ముందు నాగార్జున అనేక మూవీల్లో నటించినా.. అవి రొమాంటిక్ గానే నిలిచాయి. కానీ నాగార్జున కెరీర్ ను ఫీక్ స్థాయికి తీసుకెళ్లింది మాత్రం శివ మూవీ అని చెప్పొచ్చు.

    నాగార్జున టాప్ హిరోగా మారడానికి గుర్తింపు తెచ్చిన అయిదు బ్లాక్ బ్లస్టర్ సినిమాలను ఒకసారి పరిశీలిస్తే.. నిన్నే పెళ్లాడతా సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ. ఈ సినిమాలోని సాంగ్స్ తో పాటు ఫ్యామిలీ బంధాల మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య మూవీ నాగార్జున లోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

    రొమాంటిక్, మాస్ మూవీలు చేస్తున్న నాగార్జునను అన్నమయ్య గా చూపించి రాఘవేంద్రరావు సక్సెస్ అయ్యారు. నాగార్జునను కూడా ఈ విధంగా చూసిన ప్రేక్షకులు ఎంతో ఆనందించారు. ఆ తర్వాత చాలా ఏండ్ల తర్వాత వచ్చిన శ్రీ రామదాసు మూవీ కూడా ఎంతో అద్భుతమైన పర్ఫామెన్స్ ను కనబరిచింది. 2016 లో వచ్చిన సొగ్గాడే చిన్ని నాయన సినిమా కూడా నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొదటి సారి రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు చేసి చరిత్ర సృష్టించింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna : అందాల భామల కోసం కలిసిన అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్

    Nagarjuna : గతంలో N కన్వెన్షన్ కూల్చివేత, మంత్రి కొండా సురేఖ అక్కినేని...

    Nagarjuna : బీజేపీ లోకి నాగార్జున..? కుటుంబంతో కలిసి మోడీ దగ్గరకు..

    Nagarjuna : టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇటీవల తన కుటుంబంతో...

    Nagachithanaya: కాబోయే భార్యతో ఫొటో పెట్టి.. ఇదేం పని చైతూ?

    Nagachithanaya: అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల ఇటీవల...

    Nagarjuna : నాగార్జున, అమల పెళ్లి వెనుక ఇంత నడిచిందా..?

    Nagarjuna : టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటిఫుల్‌ కపుల్స్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది...