Top-10 Cars : గత నెల (జనవరి) అమ్మకాల జాబితాలను దేశీయ మార్కెట్ వాహన సంస్థలు ఇటీవల విడుదల చేశాయి. ఇందులో మారుతి సుజుకి టాప్ ప్లేస్ లో ఉండగా.. టాటా మోటార్స్ తర్వాతి స్థానంలో ఉంది. 2024, జనవరిలో ఎక్కువ అమ్మకాలు జరిగిన టాప్ 10 కార్లు ఇవి? అగ్రస్థానంలో ఈ మోడల్? వాటి గురించి చూద్దాం.
టాప్ 10 కార్లలో 7 మారుతి సుజుకికి చెందినవే కాగా.. మిగిలిన వాటిలో 2 టాటా, ఒక మహీంద్రా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే భారత మార్కెట్ లో మారుతి కార్లకు ఎంత డిమాండ్ ఉంది. ఏ స్థాయిలో అమ్మకాలు సాగిస్తుందో అర్థమైపోతోంది.
మారుతి బెలెనో..
కొంత కాలంగా మంచి అమ్మకాలను నమోదు చేస్తుంది బెలెనో.. 2024 ప్రారంభంలో కూడా ఊహించని స్థాయిలో అమ్ముడైంది. జనవరిలో 19630 యూనిట్లు అమ్మకాలు జరిపి దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మకాలు 2023, జనవరి కంటే 20.01 శాతం ఎక్కువవడం గమనార్హం.
టాటా పంచ్..
దేశీయ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ టాటా పంచ్ లాంచ్ నుంచి అమ్మకాలు ఆశా జనకంగానే ఉన్నాయి. సింపుల్ డిజైన్, బెస్ట్ ఫీచర్స్, సేఫ్టీ, ఫైస్టార్ రేటింగ్ ఉంది. ఈ కారణాలతో ఎక్కువ మంది ఈ కారును కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. టాటా పంచ్ 2024, జనవరిలో 17,978 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ అమ్మకాలు 2023, జనవరి కంటే 49.74 శాతం ఎక్కువ.
మారుతీ వ్యాగన్ R..
మారుతీ వ్యాగన్ ఆర్ ఎక్కువ అమ్మకాలను సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఇది మధ్య తరగతి వారికి ఇష్టమైన మోడల్. దీంతో దీని అమ్మకాలు గణనీయంగా ఉంటాయి. 2024, జనవరిలో 17,756 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇది కూడా మంచి డిజైన్, ఫీచర్స్, బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తుంది.
టాటా నెక్సాన్..
మంచి సేఫ్టీ ఫీచర్స్, ఉత్తమమైన పనితీరు కలిగి ఉన్న కారు టాటా నెక్సాన్.. గత నెలలో (2024, జనవరి) 17,182 యూనిట్ల అమ్మకాలను సొంతం చేసుకుంది. 2023 జనవరి కంటే ఈ అమ్మకాలు 10.37 శాతం ఎక్కువ. టాటా నెక్సాన్ డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇది త్వరలో సీఎన్‌జీ కూడా రావచ్చని తెలుస్తోంది.
మారుతి డిజైర్..
ఉత్తమ అమ్మకాలు పొందిన వాటిలో ఐదో నెంబర్ లో ఉంది మారుతి డిజైర్. ఈ కాంపాక్ట్ సెడాన్ 2024, జనవరిలో 16,773 యూనిట్ల అమ్మకాలను సాధించింది. స్విఫ్ట్ మోడల్ ఉండడంతో ఉత్తమ అమ్మకాలను తెచ్చిపెడుతోంది.
మారుతీ స్విఫ్ట్..
మారుతి సుజుకి అంటేనే గుర్తొచ్చే మరో కారు స్విఫ్ట్. కొన్నేళ్ల నుంచి విపరీతమైన అమ్మకాలతో దూసుకుపోతోంది. గత నెలలో కూడా 15,370 యూనిట్లు అమ్ముడైంది. దీంతో దేశంలో అత్యధికంగా అమ్మకాలు పొందిన ఆరో కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. 2024, జనవరి అమ్మకాలు 2023, జనవరి అమ్మకాల కంటే 6.51 శాతం పెరిగాయి.
మారుతీ బ్రెజ్జా..
మారుతి సుజుకి బ్రెజ్జా ఏడో స్థానంలో ఉంది. జనవరిలో 15,303 యూనిట్ల కార్లను విక్రయించింది కంపెనీ. 2023, జనవరి కంటే కూడా ఈ ఏడు 6.57 శాతం ఎక్కువవడం గమనించదగ్గ విషయం. మారుతి బ్రెజ్జా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పని తీరుతో ఉంది.
మారుతీ ఎర్టిగ..
చూసేందుకు ఇన్నోవాను తలపించే కారు మారుతీ ఎర్టిగా దీని అమ్మకాలు అద్భుతంగా ఉన్నాయి. గత నెలలో ఈ MPV మొత్తం అమ్మకాలు 14,632 యూనిట్లు, 2023, జనవరితో పోలిస్తే ఈ సేల్స్ 50.07 శాతం అధికం. ఈ కారు మార్కెట్ లో అడుగు పెట్టినప్పటి నుంచి 10 లక్షల యూనిట్లు అమ్ముడైంది. అమ్మకాల్లో మారుతి సాధించిన రికార్డనే చెప్పాలి.
మహీంద్రా స్కార్పియో..
9వ స్థానంలో నిలిచిన కారు మహీంద్రా స్కార్పియో. గత నెలలో స్కార్పియో SUV 14,293 యూనిట్ల అమ్మకాలు చేసింది. మంచి డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది.
మారుతీ ఫ్రాంక్స్..
గతేడాది ఏప్రిల్ 23న లాంచ్ అయిన మారుతి సుజుకి కొత్త కారు ‘ఫ్రాంక్స్’ అమ్మకాల్లో పదో స్థానంలో నిలిచింది. ఈ SUV అమ్మకాలు గత నెలలో 13,643 యూనిట్లు. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే అమ్మకాల్లో టాప్ 10 జాబితాలో చేరింది. అంటే.. దీనికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.