Tollywood Love Couples :
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం డేటింగ్ కల్చర్ సాగుతుంది. ఇంతకు ముందు వరకు డేటింగ్ కల్చర్ అనేది బాలీవుడ్ లో మాత్రమే చూసేవాళ్ళం.. కానీ ఇప్పుడు మన టాలీవుడ్ అన్నిటిలో ఎదిగి ఇందులో మాత్రం ఎందుకు ఎదగకూడదు అనుకుందో ఏమో తెలియదు కానీ ఇక్కడ కూడా సెలెబ్రిటీల మధ్య డేటింగ్ కల్చర్ పెరిగి పోతుంది.. మరి ఇప్పటికే ఇలాంటి విషయాల్లో చాలా మందిపై గాసిప్స్ వచ్చాయి..
అయితే ఇవి రూమర్స్ నా లేదంటే నిజంగానే డేటింగ్ లో ఉన్నారా అనే కన్ఫ్యూజన్ పెరుగుతుంది.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే జంటలు మాత్రం అలా కాకుండా చాలా ఓపెన్ గానే లవ్ లో ఉన్నట్టు ప్రకటించారు.. మరి టాలీవుడ్ లో ప్రజెంట్ ప్రేమ పక్షులుగా జంటలుగా విహరిస్తున్న హీరో హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం..
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న : ఈ ఇద్దరు కలిసి తొలిసారిగా గీత గోవిందం సినిమాలో కనిపించారు. ఈ సినిమాతో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్ ను బాగా అలరించింది.. దీంతో ఈ జంట ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. అలా అప్పటి నుండి వీరి మధ్య రియల్ గా కూడా రిలేషన్ నడుస్తుందని వార్తలు వచ్చాయి.. వీరు తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెబుతున్నప్పటికీ వీరి మధ్య పక్కాగా రిలేషన్ ఉందంటూ ఫ్యాన్స్ తేల్చేస్తున్నారు.
సిద్ధార్థ్ – అతిథి రావు హైదరీ : ఈ జంట కూడా చాలా రోజులుగా బయట కనిపిస్తూ వీరి మధ్య రిలేషన్ ఉందని చెప్పకనే చెబుతున్నారు. ముందుగా లవ్ మ్యాటర్ ఖండించిన ఈ జంట ఆ తర్వాత బయట పార్టీలు, పబ్బులు అంటూ తిరిగి కెమెరా ముందు కనిపించి హల్చల్ చేసారు.. దీంతో అంతా ఈ జంట మధ్య కుచ్ కుచ్ హోతా హై ఉందంటూ ఫిక్స్ అయ్యారు.. ఇక అతి త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.
విజయ్ వర్మ – తమన్నా భాటియా : ఈ జంట తొలిసారిగా బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో కలిసి నటించారు. ఇక మొదటి పరిచయమే ప్రేమకు దారి తీయగా ఇప్పుడు ఈ జంట లవ్ లో మునిగి తేలిపోతున్నారు. ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్తూ డేటింగ్ లో ఉన్నట్టు చెప్పకనే చెబుతున్నారు.