19.8 C
India
Sunday, February 25, 2024
More

    Richest Temples : భారత్ లో రిచ్చెస్ట్ టెంపుల్స్ ఇవే! ఆదాయం ఎంతంటే?

    Date:

    Richest Temples
    Richest Temples in india

    Richest Temples : సనాతన ధర్మం పుట్టినిల్లు భారత్. ఒకప్పుడు అఖండ భారత్ గా వెలుగొందిన నేల కాల క్రమేనా మార్పునకు గురవుతూ వచ్చింది. సనాతన ధర్మంలో పుట్టిన హిందూ ధర్మం ఇక్కడ వర్ధిల్లుతుంది. ఇందులో భాగంగా భగవత్ ఉపాసకులు తమ ఇష్ట దైవాలను ఆయా రూపాల్లో కొలుస్తుంటారు. ఒక్కో భగవంతుడికి ఒక్కో క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాలకు నిత్యం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆక్షేత్రాల్లో ఉన్న ఆలయాలు రిచ్చెస్ట్ (ధనిక) టెంపుల్స్ గా అవతరించాయి. భారత్ లోని అత్యంత ధనిక ఆలయాల్లో టాప్ 5 గురించి ఇక్కడ తెలుసుకుందాం.

    పద్మనాభ స్వామి..
    దక్షిణ భారతంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఈ ఆలయం ఉంది. ఈ కోవెలలో శ్రీహరి తల్పంపై ఒక వైపునకు పడుకొని ఉంటాడు. అత్యంత భారీ విగ్రహం ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి భక్తులు పోటెత్తుతారు. ఆలయంలోని నేల మాలిగలను తెచిన సమయంలో కోట్లాది రూపాయల విలువైన సంపద బయటపడింది. ఇప్పటికీ ఒక మాలిగను తెరవలేదు. నాగబంధంతో ఉండడంతో సంకోచిస్తున్నారు. ఈ ఆలయం ఆస్తి విలువ రూ.1,20,000 కోట్లు. భారతదేశంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఇది మొదటిది.

    తిరుమల శ్రీవారు..
    కలియుగ దైవంగా శ్రీ వేంకటేశ్వరుడు తిరుమల కొండపై వెలిశారు. ఈ ప్రాంతం దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి ప్రపంచంలోని నలు మూలల నుంచి భక్తులు వస్తుంటారు. వందలు, వేలాది కోట్లు శ్రీవారికి హుండీల ద్వారా కలిసి వస్తుంది. పైగా సేవలకు కానుకలు సమర్పించేందుకు భక్తులు కోట్లాది రూపాయల విరాళాలను కూడా ఇస్తుంటారు. ఇక దేశంలో అత్యంత ధనిక దేవాలయంగా శ్రీవారి ఆలయం కీర్తి ఘడించింది. బంగారంతో పాటు రూ. 14 వేల కోట్ల ఆస్తులున్నట్లు తెలుస్తోంది.

    షిర్డీ సాయిబాబా ఆలయం
    ముస్లింలతో పాటు, హిందువులు ఈ ఆలయంలో షిర్డీ సాయి బాబాను దర్శించుకొని ఆనందం పొందుతారు. దేశ వ్యాప్తంగా ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. ప్రతీ రోజూ బాబాకు ఇచ్చే హారతిని చూసేందుకు కోట్లాదిగా భక్తులు తరలివస్తారు. ఈ ఆలయ వార్షిక ఆదాయం రూ.1800 కోట్లు వరకు ఉంటుందని అంచనా.

    వైష్ణోదేవి ఆలయం
    కశ్మీర్ నుంచి 12 కిలో మీటర్ల దూరంలో 52000 అడుగుల ఎత్తుపై ఉన్న ఒక గుహలో అమ్మవారు కొలువైన ఆలయం ఇది. భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు కఠిన మైన మంచులో కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ ఆలయానికి ప్రతీ ఏటా రూ. 500 కోట్ల వరకు విరాళాలు అందుతాయి.

    సిద్ధి వినాయక ఆలయం
    ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం దేశంలోని ఐదో అత్యంత ధనిక ఆలయం. దేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఇదీ ఒకటి. గజముఖుడి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దీనికి తోడు ప్రతీ ఏటా వినాయక చవితి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతాయి.  ఏడాదికి రూ.125 కోట్ల ఆదాయం వస్తుంది.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kaleshwaram Importance : కాళేశ్వరం ప్రాశస్త్యం ఏంటో తెలుసా?

    Kaleshwaram Importance : ఆంధ్రదేశంలో త్రిలింగాల్లో ఒకటి. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం మూడు...