30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Ambani wedding : అంబానీ వారి పెళ్లికి హాజరైన దక్షిణాది సెలబ్రెటీలు వీళ్లే

    Date:

    Ambani wedding : రిలయన్స్ అధినేత, ప్రపంచ అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం కనులపండువగా కొనసాగుతోంది. అనంత్, రాధిక ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడు నెలలుగా సాగిన ఈ పెళ్లి తంతు చివరి అంకానికి చేరుకుంది. జియో వరల్డ్ కాంప్లెక్స్‌లో ఈ జంట అత్యంత ఘనంగా వివాహ బంధంతో ఒక్కటి అయింది. అంబానీ నివాసం అంటిలియా నుంచి కళ్యాణ వేదికకు అనంత్‌ అంబానీ ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. కుటుంబసభ్యులు, బంధువులతో పాటు రాజకీయ నాయకులు, భారత సినీ ప్రముఖులతోపాటు హాలీవుడ్ తారలు, క్రికెటర్లు, క్రీడాకారులు ఈ పెళ్లిలో మెరిసిపోయారు.

    శుక్రవారం రాత్రి జరిగిన అనంత్ అంబానీ వివాహ సంబరాల్లో టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత, కూతురు సితారతో కలిసి వివాహ వేడుకకు హాజరయ్యారు. హీరో రాంచరణ్ దంపతులు, హీరో వెంకటేశ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంతో సహా హాజరయ్యారు. కాగా, రజనీకాంత్ పెళ్లికొడుకు అనంత్‌ అంబానీతో కలిసి చిందేశారు. ఈ వేడుకలో రజనీ డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా వీరితో కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలకు టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వారి వారి కుటుంబంతో సహా హాజరయ్యారు. ప్రొఫెషనల్ రెజ్లర్ జాన్ సీనా, నిక్ జొనాస్-ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, గౌరి ఖాన్, సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అర్పిత్ ఖాన్, సూర్య, జ్యోతిక, క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నిధి అగర్వాల్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్, వికీ కౌశల్, ధోనీ, సాక్షి, జివా, జాకీ ష్రాఫ్, కేఎల్ రాహుల్, అతియా శెట్టి, సునీల్ శెట్టి, అహాన్ శెట్టి తదితరులు హాజరయ్యారు. అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కిమ్ కర్దాషియాన్, ఆమె సోదరి ఖోలే కర్దాషియాన్, బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్ కూడా అనంత్-రాధికల వివాహక వేడుకకు హాజరయ్యారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ambani : అంబాని ఇంట పెళ్లిలో ఏపీకి చెందిన ఇద్దరు అరెస్ట్.. కారణం ఇదే..

    Ambani Wedding : ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ...

    Rameswaram Cafe : అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. రామేశ్వరం కేఫ్ పేలుడుకు లింక్!!

    Rameswaram Cafe : అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్...