
Symptoms Healthy : ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. నువ్వు ఎంత సంపాదించావన్నది కాదు ఎంత ఆరోగ్యంగా ఉన్నావన్నదే ముఖ్యం. అందుకే ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణలో మనం తీసుకునే జాగ్రత్తలే మనకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. ఆహారం విషయంలో మనం ఎంతో ముందుచూపుతో వ్యవహరించాలి. మనకు ఇబ్బందులు తెచ్చే వాటి జోలికి వెళ్లకపోవడమే బెటర్. కానీ చాలా మంది జిహ్వ చాపల్యం కోసం వెంపర్లాడుతున్నారు.
మనం ఆరోగ్యంగా ఉన్నామనడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వేళకు నిద్ర పోవడం సరైన సమయానికి నిద్ర లేవడం. కొందరు తొందరగా పడుకుంటారు కానీ తొందరగా లేవరు. ఇది అనారోగ్యమే. మనం ఎప్పుడు పడకున్నా కరెక్టు సమయానికి నిద్ర లేవాలి. మలబద్ధకం సమస్య కూడా ఉండకూడదు. మలం సాఫీగా వెళితేనే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క.
ఆకలి కూడా బాగా ఉండాలి. సమయానుకూలంగా తినాలనే కోరిక కలగాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. ఆరోగ్యంగా లేకపోతే ఆకలి వేయదు. తినాలని అనిపించదు. చాతీ చుట్టు కొలత నడుం చుట్టు కొలత కంటే ఎక్కువగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండటం కూడా ఆరోగ్య లక్షణాల్లో ఒకటి. దీంతో మన జీవితంలో మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు అన్ని అనుకూలంగా ఉంటాయని తెలుసుకోవడం చాలా మంచిది.
బాగా నిద్రపోవడం, ఆకలి సరిగా వేయడం, మలవిసర్జన సక్రమంగా చేయడం, సంతోషంగా ఉండటం, నడుం చుట్టు కొలత కంటే చాతీ చుట్టు కొలత ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలతో పాటు మనకు జీవితంలో ఎలాంటి బాధలు వచ్చినా సమర్థంగా ఎదుర్కొని నిలవాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే ఇబ్బందులే వస్తాయి.