World Cup క్రికెట్ అభిమానులకు ఇక పండుగే. ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే ప్రపంచకప్ మొదలు కాబోతున్నది. అది కూడా ఇండియాలో..ఈ భారీ సమరానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఈ సమరంలో సెమీ ఫైనల్ చేరే జట్లు ఏవో ఇప్పటికే టీమిండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పేశాడు. తాజాగా ఓ క్రీడాచానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన తన అంచనా ప్రకారం ఐదు జట్ల పేర్లను ప్రకటించాడు.
సౌరవ్ గంగూలీ అంచనా ప్రకారం భారత్, అస్ర్టేలియా, ఇంగ్లాండ్ జంట్లకు పూర్తి స్థాయి అవకాశమున్నదని చెప్పాడు. అయితే ఇక న్యూజీలాండ్, పాకిస్థాన్ జట్లు కూడా కొద్దిగా మెరుగైన ప్రదర్శన చూపితే సెమీస్ కు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే తన సొంత గడ్డ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా, పాకిస్థాన్ తలపడాలని కోరకుంటున్నానని గంగూలీ పేర్కొన్నాడు. కాగా ఇప్పటికైతే లీగ్ స్టేజీలో భారత్, పాకిస్థాన్ పోరు లీగ్ దశలో అక్టోబర్ 15న ఖరారైంది.
అయితే టీమిండియా గురించి కూడా దాదా మాట్లాడాడు. ప్రస్తుత జట్టు గత రికార్డులను తారుమారు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పాడు. కెప్టున్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో ఈసారి కప్పు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా ఓడిపోయినా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని చెప్పుకొచ్చాడు. ఫైనల్ చేరడం కూడా ఒక ఘనతే అని పేర్కొన్నాడు. అయితే టీమిండియా పై ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని, దానిని అధిగమిస్తుందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ నాయకత్వాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలులేదని, ఐపీఎల్ లో 5 ట్రోఫీలు సాధించాడని, ఈ సారి తప్పకుండా ప్రపంచ కప్ టీమిండియాకు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.