Kartika Poornami : హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఒక సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణమి తిథిలు ఉన్నాయి. కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అందుకే దీనిని త్రిపురారి పూర్ణిమ అని పిలుస్తారు. కార్తీక పూర్ణిమ రోజు పవిత్ర నదిలో స్నానం చేయడం, దానాలు చేయడం ముఖ్యంగా దీపం దానం చేయడం వల్ల పాపాలు తొలిగిపోయి పుణ్య ఫలాలు వస్తాయని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి ప్రకారం.. గంగాస్నానం చేయడం, విష్ణువును పూజించడం విశిష్టత కలిగి ఉంది.
గంగా స్నానం చేస్తే ఏడాది పొడువున గంగా స్నానం చేసినంత పుణ్యం వస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించం చాలా ముఖ్యం. అయితే శ్రీ మహా విష్ణువు మత్య్సావతారం పొందిన రోజు కార్తీక పౌర్ణమి అని అనుకుంటారు. సిక్కు మత గురువు గురు నానక్ కూడా ఇదే రోజు జన్మించారని అంటుంటారు. కార్తీక పూర్ణిమ నాడు, గురుద్వారాలలో సిక్కులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
గంగా స్నానం, దీపారాదన, దీపాలు దానం చేయడం, యాగాలు చేయడం లాంటి పూజలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శ్రీ మహా విష్ణువు, లలితా సహస్రనామం చేయాలి.
మంత్రాలను ముఖ్యంగా విష్ణుసహస్రనామం జపించడం చాలా ముఖ్యం. దీని తరువాత విష్ణువును పూజించి ఆయనకు ఇష్టమైనవి సమర్పించాలి. ఈ రోజున శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఈ రోజు దేవ్ దీపావళి అని అంటారు.
ఆలయాలకు వెళ్లి రాత్రి సమయంలో దీపాలు వెలిగించి ప్రత్యేకంగా పూజలు చేయాలి. దీపారాధన చేసి ఈ విష్ణువును ఆరాధించాలి. ఆవుకు అన్నం పెట్టాలి. గోమాతను పూజించాలి. నదీ పరివాహాక ప్రాంతంలో ఎక్కువ మంది దీపారాధన చేస్తుంటారు. ఇంట్లో తులసి పూజ చేయాలి. ముఖ్యంగా ఉసిరికాయ దీపం వెలిగించడానికి కూడా ప్రయత్నించాలి. దీపాల పండగతో కార్తీక పౌర్ణమిని జరుపుకుని ఆనందంగా దేవుడి సేవలో తరించాలి.