Top 10 Bikes ఇటీవల కాలంలో బైకుల హవా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు స్టైల్ గా ద్విచక్ర వాహనాలనే వాడుతున్నారు. ఇందులో రకరకాల బైకులు వచ్చాయి. దీంతో వినియోగదారులు తమకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. స్పోర్ట్స్ బైకులైతే బాగా అమ్ముడవుతున్నాయి. బైక్ మీద స్వారీ చేస్తే గుర్రం మీద వెళ్లినట్లుగా ఫీలవుతున్నారు. దీంతో కంపెనీలు రకరకాల బైకులు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటి మీద యువత స్వారీ చేస్తున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం బైకుల్లో యమహాకు భలే క్రేజీ ఏర్పడింది. యమహా ఎంటీ12 వీ2 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.66 లక్షల నుంచి 1.69 లక్షల వరకు పలుకుతోంది. మరో బైక్ స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ షో రూం ధర రూ. 74 వేల నుంచి 75 వేలుగా ఉంది. మరో వాహనం హోండా యాక్టివా 6జీ ఎక్స్ షో రూం ధర రూ. 76 వేల నుంచి 82 వేల వరకు ఉంటోంది. వీటిని అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.
రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 ఎక్స్ షోరూం ధర రూ. 1.50 లక్షల నుంచి 1.75 లక్షల వరకు పలుకుతోంది. యమహా ఆర్15ఎస్ ఎక్స్ షో రూం ధర రూ. 1.64 లక్షలుగా చెబుతున్నారు. మరో బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 ఎక్స్ షోరూం ధర రూ. 1.93 లక్షల నుంచి 2.25 లక్షల వరకు ఉంటోంది. టీవీఎస్ ఎన్టీఓఆర్ క్యూ 125 ఎక్స్ షోరూం ధర రూ. 84 వేల నుంచి 1.04 లక్షల వరకు ఉంది.
టీవీఎస్ రైడర్ ఎక్స్ షోరూం ధర రూ. 86 వేల నుంచి 1 లక్ష పలుకుతోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 ఎక్స్ షోరూం ధర రూ. 1.60 లక్షల నుంచి 1.69 లక్షలుగా ఉంది. ఇలా రకరకాల బైకులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. యువత వాటిని కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారు. ప్రస్తుతం అందరు బైకులే అధికంగా వాడుతున్నారు.