
These do not work if meat avoid not given up : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన అవయవాలు అన్ని సక్రమంగా ఉండాలి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. ఏ అవయవం పనిచేయకపోయినా ఇబ్బందులు వస్తాయి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మన శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. అందులో గుండె, మెదడు, కిడ్నీలు, కాలేయం వంటి భాగాలు మనకు అత్యంత కీలకం. వీటిని కాపాడుకోవాలంటే సరైన ఆహారాలు తీసుకోవాలి. ఏది ఎక్కువ అయినా ఇవి దెబ్బతింటే మన మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది.
ప్రస్తుతం చాలా మంది కిడ్నీ సంబంధ రోగాలు ఎదుర్కొంటున్నారు. మన దేహంలో అత్యంత కీలకంగా భావించే కిడ్నీల పనితీరు మందగిస్తే కూడా మనకు కష్టాలే వస్తాయి. కిడ్నీలు పాడైతే డయాలసిస్ చేయించుకోవాలి. దీని వల్ల ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఈ నేపథ్యంలో మన అవయవాలు సక్రమంగా ఉంచుకునేందుకు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
యూరిక్ యాసిడ్ పురుషులలో 6.5 మిల్లీ గ్రాములు, స్త్రీలలో 3.5 నుంచి 6 మిల్లీగ్రాములు సాధారణమైనవిగా చెబుతారు. ప్రస్తుత రోజుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతున్నాయి. దీంతో చాలా రకాల సమస్యల వస్తున్నాయి. కిడ్నీ, కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారు యూరిక్ యాసిడ్ వైఫల్యంతోనే ఇవి పాడవుతున్నాయని తెలుస్తోంది.
దీనికి మనం సరైన ఆహారం తీసుకోవాల్సిందే. మాంసాహారానికి దూరంగా ఉంటేనే సాధ్యమవుతుంది. మాంసం ఎక్కువగా తీసుకుంటే యారిక్ యాసిడ్ సమస్య తగ్గదు. అందుకే మాంసాహారాన్ని పూర్తిగా మానేయడమే శ్రేయస్కరం. కానీ దీన్ని మనం సాధ్యమైనంత వరకు మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.