
Drink water in pot : వేసవి తాపం పెరిగిపోయింది. ఎండలు మండుతున్నాయి. ఒళ్లంతా చెమటలు కక్కుతోంది. దీంతో మాటిమాటికి నీళ్లు తాగాలనిపిస్తుంది. చాలా మంది ఫ్రిజ్ లో వాటర్ తాగుతుంటారు. కానీ ఫ్రిజ్ వాటర్ అంత మంచిది కాదు. అందులో నీళ్లు తాగితే మనకు అనారోగ్యం కలుగుతుంది. అందుకే ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలి.
వేసవిలో మట్టి పాత్రల్లో నీరు తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ఉండే ఖనిజాలు, బ్రేస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. రోజు కుండలోని నీరు తాగితే మనకు ఇతర ఏ రోగాలు కూడా రాకుండా ఉంటాయి.
కుండలో నీరు కూడా చల్లగా ఉంటుంది. ఫ్రిజ్ లో నీరు కూడా చల్లానే ఉంటున్నా ఇందులో మంచి గుణాలు ఉండవు. కుండలోనీరు తాగితే ఆరోగ్యం మెరుగవుతుంది. ఫ్రిజ్ లో నీళ్లు తాగితే ఒంట్లో వేడి పెరుగుతుంది. కుండలో నీళ్లు తాగితే చల్లదనం వస్తుంది. ఇలా తేడా ఉండటం వల్ల మనం కుండలో నీళ్లు తాగేందుకే ఇష్టపడాలి.
కుండలో నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. మెటబాలిజం సరిగా లేకపోతే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. జీర్ణక్రియలు సరిగా లేకపోతే అజీర్తి, గ్యాస్ వంటివి బాధిస్తాయి. బరువు తగ్గేందుకు కూడా కుండలో నీరు సాయపడుతుంది.