
Nirjala Ekadashi : మన హిందూమతంలో ఏకాదశికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజు ఉపవాసం కూడా చేస్తారు. దేవుడికి ఏకాదశి అంటే చాలా ఇష్టమని చెబుతుంటారు. ఇవి నెలకు రెండు వస్తాయి శుక్ల పక్షంలో ఒకటి క్రిష్ణ పక్షంలో మరొకటి వస్తుంది. జ్యేష్ట మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు.
మే 31న నిర్జల ఏకాదశి వస్తుంది. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అందుకే కష్టాల నుంచి విముక్తి కావడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. తులసి మొక్క వద్ద తప్పులు చేయకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం తులసిని వేడుకోవడం మంచిది. లక్ష్మీదేవిని తులసి చెట్టులోనే చూసుకుంటారు.
ఈ రోజు తులసి మొక్కకు నీళ్లు పోయరాదు. తులసి ఆకులు తెంచకూడదు. అవసరమైతే ముందు రోజు దాని ఆకులు తెంచుకోవాలి. తులసి ఆకులను గోళ్లతో తెంచొద్దు. దీని ఆకులను తుంచడానికి ముందు దానికి నమస్కరించాలి. మురికి చేతులతో తులసి చెట్టును తాకకూడదు.
నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్కకు మురికి ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరి. తులసి చెట్టు దగ్గర చెప్పులు, బూట్లు విప్పకుండా చూసుకోవాలి. తులసి మొక్కను రోజు భక్తి శ్రద్ధలతో పూజించాలి. నిర్జల ఏకాదశి రోజు తులసి విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని అమలు చేయాలి.