
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో-దర్శకుడు కరుణా కరణ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘తొలిప్రేమ’. మంచి ప్రేమ కావ్యంను అంతే అద్భుతంగా తెరకెక్కించాడు కరుణాకరణ్. 1998లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను తిరగరాసింది. వంద రోజులకు పైగా థియేటర్లలో సందడి చేసింది. కీర్తిరెడ్డి హీరోయిన్ గా చేయగా పవన్ కళ్యాణ్ కు చెల్లెలిగా వాసుకి నటించింది. అన్నా చెల్లికి మధ్య నడిచే డైలాగ్స్ సినిమాకే హైలట్.
కరోనా కాలం నుంచి రీ రిలీజ్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాన్ నటించిన ‘జానీ’ సినిమా రీ రిలీజ్ కాగా రిలీజ్ నాటి కలెక్షన్లను అధిగమించింది. రజినీ కాంత్ ‘బాబా’ కూడా రీ రిలీజ్ చేయగా ఏమాత్రం ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇవన్నీ పక్కన ఉంచితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ చేశారు.
తొలిప్రేమ రీ రిలీజ్ కు సినీ అభిమానుల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీగా థియేటర్ల వద్ద సందడి చేస్తూ కనిపించారు. కానీ విజయవాడలోని ఒక థియేటర్ లో ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటింది. స్క్రీన్ వద్దకు వెళ్లి చిందేయడం కామనే. కానీ వారు ఏకంగా స్క్రీన్ ను చించేసి మరీ డాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. అభిమానం ఉంటే ఉండాలి కానీ ఇలా స్క్రీన్లు చిపడం సరైంది కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ReplyForward
|