Cricket : భారత్, వెస్టిండీస్ మధ్య గయానాలోని ప్రొవిడెన్స్‌లో రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. తొలి టీ20 మ్యాచ్‌లో విండీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో భారత్‌ను 0-1తో వెనక్కు నెట్టింది. ఇప్పుడు రెండో టీ20లో ప్లే-11కి సంబంధించి చర్చలు ప్రారంభమయ్యాయి. గయానా T20 ప్లేయర్స్ -11 నుంచి ఒకరు కాదు, ఏకంగా ముగ్గురిని పక్క పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
4 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా
ట్రినిడాడ్లో గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. డాషింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా తొలి టీ20లో 150 పరుగుల లక్ష్యాన్ని చేధించలేపోయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకొని, 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా 9 వికెట్లకు 145 పరుగులతో ఓటమి పాలైంది.
వీళ్లకు నో చాన్స్
గయానాలో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో ముగ్గురిని పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇందులో ముందుగా ఉన్నది వెస్టిండీస్ క్రికెటర్ జాన్సన్ చార్లెస్. ట్రినిడాడ్ టీ20లో మూడో స్థానంలో దిగిన చార్లెస్ 3 పరుగులు మాత్రమే చేశాడు. అతడిని కుల్దీప్ యాదవ్ దారుణంగా అవుట్ చేశాడు. కేవలం 6 బంతులు మాత్రమే ఆడగలిగాడు. రెండో నంబర్ లో ఉన్నది అల్జారీ జోసెఫ్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జోసెఫ్ అనుభవజ్ఞుడైన క్రికెటర్, కెప్టెన్ పావెల్ అతనిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. జోసెఫ్ మొదటి T20 మ్యాచ్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో కెప్టెన్ పావెల్ అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉన్నది. జోసెఫ్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 9.8 ఎకానమీ రేటుతో 39 పరుగులు చేశాడు.
కైల్ మేయర్స్ కూడా..
ఓపెనర్ కైల్ మేయర్స్ కూడా విండీస్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లోని ఓపెనింగ్ టీ20 మ్యాచ్‌లో మేయర్స్ కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. మేయర్స్‌ను యుజ్వేంద్ర చాహల్ ఎల్‌బీడబ్ల్యూ అవుట్ చేశాడు. మేయర్స్‌కు 18 టెస్టులు, 28 వన్డేలు, 25 టీ20లు ఆడిన అనుభవం ఉంది. అతను టెస్టులు, వన్డేలలో రెండు సెంచరీలు చేశాడు. అయితే ఇదే పేలవమైన ఆట తీరు కొనసాగితే, అతను ప్లేయింగ్-11లో స్థానం కోసం పోటీని ఎదుర్కొక తప్పదు.