Rakesh Master :
తీవ్ర అనారోగ్యానికి గురైన రాకేశ్ మాస్టర్ తగ ఆదివారం కన్నుమూసిన విషయం మనుకు తెలిసిందే.. గాంధీలో చికిత్స పొందిన ఆయన మరణించారు. ఆయన కెరీర్ రెండు దశాబ్దాలు పాటుకొనసాగింది. టాలీవుడ్ ఇతర భాషల్లో కలిపి 1500 చిత్రాలకు కొరియోగ్రఫర్ చేశారు. జారీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లాంటి ఫేమస్ కొరియోగ్రాఫర్లను ఇండస్ట్రీకి ఇచ్చారు రాకేశ్ మాస్టర్. టాలీవుడ్ తో పాటు తమిళం, మరికొన్ని ఇండస్ట్రీలలో టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న రాకేశ్ మాస్టర్ చాలా వివాదాల్లో కూడా ఉన్నారు.
ఇండస్ట్రీలోని ధిగ్గజ డైరెక్టర్, హీరోలతో ఆయన వివాదాలు పెట్టుకున్నారు. దీంతో అవకాశాలు తక్కువై చివరికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. యూట్యూబర్ గా కూడా ఆయన చాలా వివాదాలు సృష్టించాడు. నాకు నచ్చినట్టు నేను బతుకుతా అంటూ వీడియోలు కూడా షేర్ చేసేవాడు. ఇంత టాలెంట్ ఉన్న ఆయనకు సరైన గుర్తింపు దక్కలేదు. రాకేశ్ మాస్టర్ మొదటి భార్యతో కూతురు, కొడుకును కన్నారు. రాకేశ్ మాస్టర్ కొడుకు చరణ్ తన మరణంపై ఆవేదన చెందాడు. మా నాన్న చావుకు కారణం ముమ్మాటికీ సోషల్ మీడియానే అంటూ చెప్పుకచ్చాడు.
అనేక యూట్యూబ్ ఛానళ్లు వాటి లబ్ధి కోసం ఆయనను వాడుకున్నాయిన ఆరోపించాడు. అవే ఛానళ్లు మా నాన్న మీద నెగిటివ్ ప్రచారం కూడా చేశాయని ఆవేదన వ్యక్తం చేశాడ చరణ్ర. ఇకపై రాకేశ్ మాస్టర్ వీడియోలు ఛానళ్లలో ప్రసారం చేయకండి. మా కుటుంబ విషయాలు ఏవీ బయటపెట్టొద్దు. ఇప్పటి వరకు నవ్వులపాలు చేసింది చాలు. ఇకనైనా వదిలేయండని అంటూ రోధించాడు చరణ్. మా కుటుంబ గురించి సోషల్ మీడియాలో వీడియోలు, పోస్ట్ లు పెడితే పోలీస్ కేసు పెడతానని హెచ్చరించారు.
ప్రస్తుతం చరణ్ కామెట్లు వైరల్ అవుతున్నాయి. తిరుపతి నుంచి రామారావుగా వచ్చిన వ్యక్తి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ గా ఎదిగాడు. చెన్నైలో ఇద్దరి వద్ద శిష్యరికం చేసిన ఆయన హైదరాబాద్ కు వచ్చి డాన్స్ ఇనిస్టిట్యూట్ పెట్టాడు. వేణు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు కూడా ఆయన వద్ద డాన్స్ నేర్చుకున్నవారే. వీరితో పాటు వేలాది మంది శిష్యులు ఉన్నారు.






