King Cobra పాములంటే అందరికి భయమే. అందులో నల్లతాచు అయితే అత్యంత ప్రమాదకరం. ఇది కుడితే తొందరగానే ప్రాణాలు గాల్లో కలుస్తాయి. దీంతో నల్లతాచును చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. కానీ వారు అలా కాదు. దాంతో ఆటలాడారు. ఒకరైతే దానికి ముద్దు పెట్టాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నల్లతాచుతో వారు ఆడుకోవడం గమనార్హం.
నల్లతాచు ఎదురుపడితే భయపడి పారిపోతుంటాం. కానీ వారు మాత్రం దానికి ఎదురెళ్లారు. ఒకరు తోక పట్టుకుంటే మరొకరు తల దగ్గర కూర్చుని దాంతో ఆటలాడారు. కరవడానికి ప్రయత్నించిన ప్రతిసారి తప్పించుకుంటూ దాని కదలికలను గుర్తిస్తూ అటూ ఇటూ కదిలారు. కాటేయాలని చూసినా దాని నుంచి తప్పించుకుంటూ ఆడుకున్నారు.
దాని కాటు నుంచి తప్పించుకుంటూ ఆడుకున్నారు. తరువాత నెమ్మదిగా దాని తల మీద ముద్దుపెట్టుకున్నాడు. అతడి ధైర్యానికి అందరు అవాక్కవుతున్నారు. వారి నిర్వాకాన్ని చూసి షాక్ కు గురయ్యారు. అది తాచుపామైనా కుక్క పిల్లలా భావించి వారు ఆడుకోవడం చర్చనీయాంశం అయింది. నరాలు తెగేలా కనిపించే ఆటకు నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు.
గుర్తు తెలియని అటవీ ప్రాంతంలో ఇద్దరు యువకులకు తాచుపాము ఎదురు కావడంతో దాంతో వారు సయ్యాటలాడారు. దీంతో పాముతో అలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రమాదకరమైన ఫీట్లు చేయడం అవసరమా అని కామెంట్లు పెడుతున్నారు. జంతువులను ఇబ్బందులకు గురి చేయడం తగదని హితవు పలుకుతున్నారు. పామును అలా చేయడంతో నెటిజన్లు వారిని తిట్టిపోస్తున్నారు.
View this post on Instagram