Jagan Tshirts : ఏపీ ప్రజల కోసం కార్యక్రమాలు నిర్వహించే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రచారం కోసం ఏర్పాటు చేసే రోజులు వచ్చాయనీ వైసిపి ప్రభుత్వం నిరూపిస్తుంది. క్రీడాకారులను ప్రోత్సహిస్తా మంటూ గొప్పలు చెబుతున్న ఆడుదాం.. ఆంధ్ర కార్యక్రమాన్ని వైసీపీ నేతలు పార్టీ ప్రచార కార్యముక్రమంగా మార్చారు. ఈ పోటీల్లో తలపడే క్రీడాకారులంతా వైసిపి నవరత్నాల లోగో మధ్యలో సీఎం జగన్ చిత్రాన్ని ముద్రించి పార్టీ జెండా రంగులతో తయారుచేసిన టీ షర్టులను క్రీడాకారులకు తప్పనిసరిగా ధరించాలని షరతు విధించారు.
ప్రజాధనంతో ఏర్పాటు చేసిన పోటీలకు జగన్ చిత్రంతో ఉన్న టీ షర్టులు ఎందుకు వేసుకోవాలి అని అచ్యుతాపురానికి వచ్చిన క్రీడా కారులు గురువారం కొందరు అధికారులను ప్రశ్నించారు. జగన్ బొమ్మ తో ఉన్న దుస్తులు వేసుకోవాల్సిం దేనని మండల స్థాయి అధికారులు వైకాపా నాయకులు చెప్పడంతో పూడిమడకకు చెందిన ఇద్దరు జనసేన అభిమానులు పోటీల్లో పాల్గొనకుండానే వెనుతిరిగారు.
వీటితోపాటు కొందరు లావుగా ఉన్న వారికి పొడ వుగా ఉన్న వారికి టీ షర్టులు సరిపోక ఇబ్బందులు పడ్డారు. క్రీడలు పర్యవేక్షించడంలో అధికారుల వైఫల్యం కనిపించింది. క్రీడాకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒకరి పై ఒకరు కుర్చీలతో కొట్టుకున్న సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. పోటీలు జరిగే ప్రదేశంలో సరైన సౌకర్యాలు కల్పించడానికి ముందుకు రాని అధికారులు సీఎం చిత్రంతో ఉన్నటీ షర్టులు మాత్రం వేయించి వైసీపీకి అవసరమైన ప్రచారాన్ని చేయడంలో ముందున్నారని ఈ పోటీలు చూసినవారు విమర్శిస్తున్నారు.