
Maharashtra : ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహిస్తుంటారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై వారు ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వివిధ దాడులు, హింస ఇలాంటి సందర్భాల్లో వెంటనే అప్రమత్తమై స్వీయరక్షణచేసుకోవాలని పౌరులకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇలాంటి మాక్ డ్రిల్ లు నిర్వహిస్తుంటారు. అయితే ఇలాంటి మాక్ డ్రిల్ ఒకటి పోలీసుల చెంప చెళ్లుమనిపించింది, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
మహారాష్ర్టలోని ధూలేలో రద్దీగా ఉండే ఆలయంలోకి ఓ ఉగ్రవాది ప్రవేశించాడు. అయితే జనమంతా అతడి చేతిలో ఆయుధాలను చూసి భయపడ్డారు. అయితే ఇంతలో ఓవ్యక్తి దగ్గరికి వెళ్లి చెంపచెళ్లుమనిపించాడు. అయితే సీరియస్ వాతావరణం అంతా ఒక్కసారి అంతా నవ్వడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వారు ఇది నిజం కాదని, కేవలం మాక్ డ్రిల్ అని చెప్పడంతో అంతా నవ్వుకుంటూ వెళ్లారు.
అయితే టెర్రరిస్ట్ గా ఉన్న వ్యక్తి పోలీస్ అని తెలుసుకున్న వ్యక్తి సారీ చెప్పాడు. ఆ వ్యక్తి పేరు ప్రశాంత్ కులకర్ణి(35). అయితే ఇలా మాక్ డ్రిల్ చేయడం ఒకే అయినా ఒక్కోసారి ఎదుటి వారి భయాందోళనకు కారణమవుతుంది. హార్ట్ పేషెంట్లు ఉంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ మాక్ డ్రిల్ వీడియో నెట్ లో వైరల్ అవుతున్నది. అయితే సదరు ప్రశాంత్ కులకర్ణి పిల్లలు భయపడినందువల్లే ఆయన అలా రియాక్ట్ అయ్యాడని తర్వాత తెలుసుకున్నారు.
महाराष्ट्र के धुले में एक मंदिर में चल रही थी पुलिस की मॉकड्रिल.
मॉकड्रिल देख वहा पर मौजूद छोटे बच्चे डर की वजह से रोने लगे.
इतने में बच्चो के परिवार में से एक आदमी ने मॉक ड्रिल के दौरान ही पुलिस को तप्पड़ जड़ दिया..#Maharashtra pic.twitter.com/hmjQIc3p30
— Vivek Gupta (@imvivekgupta) August 8, 2023