
నన్ను , లోకేష్ ను కూడా బాబాయ్ ను చంపేసినట్లే చంపేస్తామని అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాడు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను కొట్టి పడేసారు అధికార పార్టీ నాయకులు. చంద్రబాబు చావుకు దగ్గరైన ముసలి నక్క లాంటి వాడని అలాంటి వాడ్ని చంపించాల్సిన దౌర్భాగ్యం మాకే కాదు ఏ ఒక్కరికీ లేదన్నారు.
చంద్రబాబు , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణలు , ప్రత్యారోపణలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా మారాయి. చంద్రబాబు చేసే ఆరోపణలకు అధికార పార్టీ నాయకులు బూతులతో సమాధానాలు ఇస్తుండటం ఆ పార్టీకి కొంత నష్టం జరుగుతున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ….. నన్ను , లోకేష్ ను చంపడానికి జగన్ పార్టీ నాయకులు కుట్రకు పాల్పడుతున్నారనే విషయం మాత్రం రాజకీయ దుమారాన్ని రేపింది. అంతేకాదు ఏపీకి భవిష్యత్ ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ కి ఓటు వేసి గెలిపించకపోతే ఏపీని ఇక ఎవడూ కాపడలేరని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.