
child star heroine : సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు బయటకు వస్తూనే ఉన్నాయి.. ఈ ఫోటోలను చూసి తమ అభిమాన నటుల చైల్డ్ హుడ్ పిక్స్ ను ఎంతో భద్రంగా దాచుకుంటున్నారు ఫ్యాన్స్.. ఇక తాజాగా ఒక స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆమె చిన్నప్పటి ఫోటో గుర్తు పట్టిన ఫ్యాన్స్ తెగ మురిసి పోతున్నారు..
ఆ చిన్నారి భామ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఈమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.. అందం, అభినయంకు ఫిదా కాని యువత లేదు.. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? అనేది తెలుసుకుందాం.. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళ భాషల్లో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో ఆడిపాడింది.

ఈమె తన నటనతో మాత్రమే కాదు తన నవ్వుతో కూడా కోట్లాది మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. ఈమె అన్ని పాత్రలు చాలా ట్రెడిషనల్ గా ఎక్కడ ఎక్స్పోజింగ్ అనేది లేకుండా కుటుంబం మొత్తం ఆదరించే సినిమాలను చేసింది. గోపీచంద్ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన తొలివలపు సినిమాతో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పటికి ఆ హీరోయిన్ ఎవరో అర్ధం అయిందిగా ఆమెనే స్నేహ..
మొదటి సినిమా అంతగా హిట్ అవ్వకపోయిన ఆ తర్వాత సినిమాలతో మంచి హిట్స్ అందుకుని హీరోయిన్ గా సక్సెస్ సాధించింది.. ప్రియమైన నీకు, శ్రీరామదాసు, సంక్రాంతి, వెంకీ వంటి ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ చిన్ననాటి ఫోటో వైరల్ అవుతుంది. ఇక 2012లో తమిళ్ హీరో ప్రసన్న కుమార్ ను పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇద్దరి పిల్లలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూనే సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది..