
America : ఇటీవల అమెరికా అధికారులు రద్దు చేసిన విద్యార్థి వీసాల (F-1)పై భారతీయ విద్యార్థులకు తీపి కబురు లభించింది. వీసా రద్దు బాధను ఎదుర్కొంటున్న పలువురు విద్యార్థుల స్థితిని అమెరికా హోం డిపార్ట్మెంట్ (DHS) తిరిగి పునరుద్ధరించటం ప్రారంభించింది. ఇది ఎంతోమందికి ఊరట కలిగిస్తోంది.స్పీడింగ్ టికెట్లు, కొట్టివేసిన మైనర్ కేసులు వంటి చిన్నచిన్న కారణాలతో కొన్ని వీసాలను రద్దు చేయగా, ఆయా విద్యార్థులు చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే, అత్యవసర కోర్టు ఆదేశాలు మరియు కొంతమంది దాఖలు చేసిన లీగల్ పిటిషన్ల ఫలితంగా ఈ నిర్ణయాన్ని తిరస్కరించడం మొదలైంది.ఇలాంటి పునరుద్ధరణలు ఇంకా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎటువంటి చిన్న తప్పులనైనా చాలా జాగ్రత్తగా తీసుకోవాలని న్యాయవాదులు సూచిస్తున్నారు.ఇది అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు కొత్త ఆశను కలిగిస్తోంది.