Inter-vocational training : పిచ్చోడి చేతిలో రాష్ట్రం అన్నట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటూ అక్కడి ప్రజల నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. జగన్ సీఎం పీఠం ఎక్కినప్పటి నుంచి రాష్ట్రం తీవ్రంగా నష్టపోతూనే ఉంది. ప్రజల కష్టాలు తగ్గించాల్సింది పోయి పెంచుతూ పోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నారు. విడిపోయిన రాష్ట్రంను చంద్రబాబు నాయుడు బాగానే చూసుకుంటున్నా.. జగన్ మరింత ముందుకు తీసుకెళ్తాడని ఓటు వేసి గెలిపిస్తే ఆయన అన్నింట్లో సమస్యలు తెస్తున్నాడు. విడిపోయిన రాష్ట్రానికి రాజధాని కోసం చంద్రబాబు అమరావతిని నిర్మిస్తే అందుకు రైతులు వారి భూములు ఇచ్చి ఆదుకున్నారు. కానీ జగన్ వచ్చీ రాగానే మూడు రాజధానులు అంటూ కొత్త ప్రతిపాదన తెచ్చారు.
జగన్ ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల అంశం రాష్ట్ర ప్రజలకు అస్సలు మింగుడు పడడలేదు. పరిపాలనా, న్యాయ, అధికార అంటూ రాజధానులను నిర్మించుకుంటూ పోతే కోట్లాది రూపాయల ప్రజా ధనం వృథానే అవడంతో పాటు ఆయా రాజధానులకు వెళ్లడం సామాన్యుడికి సైతం ఇబ్బంది కలుగుతుంది. దాదాపు ఈ అంశం రాష్ట్రం యావత్తు అల్ల కల్లోలం అయినా ఆయన మాత్రం వీటిని పట్టించుకోలేదు. మూడు రాజధానులను తెచ్చి తీరుతామని పట్టుబట్టారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం దసరాకు పరిపాలనా రాజధాని విశాఖపట్నంను ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో ఏపీ మరో సారి అల్లకల్లోలంగా మారింది. ఇందులో చంద్రబాబు నాయుడిని జైలులో వేయడం మరింత ఆగ్రహానికి గురి చేసింది.
ఇక ఉపాధ్యాయలకు జగన్ ప్రభుత్వం ఇచ్చే శిక్షణను చూసి ఇతర రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లీడర్షిప్ క్వాలిటీస్ పెంచేందుకు వృత్యంతర శిక్షణ పేరుతో సుదూరంగా ఒంగోలులో ఆరు రోజులు రెసిడెన్షియల్ ప్రోగ్రాం పెట్టి సదరు ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి ఈ ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ ను చూసి నవ్వుకుంటున్నారు. ఉపాధ్యాయులతో ఇలా వెకిలి డ్యాన్సులు చేయించడం ఏంటని మండిపడుతున్నారు.