- మెసేజ్ పెట్టి మరి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ఏపీలోని విజయవాడలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దిజ్ ఈజ్ మైలాస్ట్ డే అనే ఇన్ స్టా లో పెట్టిన కాసేపటికే ఆ యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది.
విద్యార్థి ఎవరంటే..
తోటవల్లూరు మండలం వల్లూరు పాలెంకు చెందిన జమ్మలమూడి జీవన్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. కాగా తండ్రి ఓ ప్రాంతంలో వాచ్ మెన్గా పనిచేస్తున్నాడు. ఇటీవల తండ్రి ఈఎంఐ కట్టేందుకు ఇచ్చిన డబ్బులను వాడుకున్నాడు. దీంతో తండ్రి మందలించాడు. అలిగిన జీవన్ ఇంటి నుంచి సోమవారం వెళ్లి ఫ్రెండ్ రూంలో పడుకున్నాడు. తర్వాత మంగళవారం తిరిగి ఇంటికి వచ్చి, స్నేహితుడి బర్త్ డే ఉందని చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇన్ స్టా లో తనకు ఇదే చివరి రోజంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసి న ఓ స్నేహితుడు హేళన చేశాడు. సాయంత్రం నీకే తెలుస్తుంది లే అంటూ జీవన్ రీ పోస్ట్ చేశాడు.
ఆ తర్వాత ఫ్రెండ్ పుట్టిన రోజు వేడుకలకు హాజరై, కాసేపు అక్కడే గడిపాడు. ఫ్రెండ్ బైక్ తీసుకొని బయటకు వెళ్లాడు. తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. సంతోషంగా లేనని ,తండ్రి డబ్బులు వాడుకోవడం తప్పేనని చెప్పాడు. నాన్న ను జాగ్రత్తగా చూసుకో.. నన్ను క్షేమించు అంటూ ఫోన్ కట్ చేశాడు. తర్వాత తల్లి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అక్కడికి సమీపంలోని పెట్రోల్ బంక్లో పెట్రోల్ తీసుకొని వెళ్లాడు. పెద్దపులిపాక సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
బుధవారం ఉదయం జీవన్ డెడ్ బాడీని స్థానిక రైతులు గుర్తించారు. పోలీసులు స్థానికంగా సీసీ కెమెరాలు పరిశీలించగా, ఒక్కడే బైక్ పై వెళ్లినట్లు గుర్తించారు. ఒక్కగానొక్క కొడుకు మృతి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మృతదేహాన్ని పరిశీలించిన వైద్య సిబ్బంది ఆత్మహత్యగానే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు ఇలా బలవన్మరణానికి పాల్పడడం, ఇటు స్నేహితుల్లోనూ దు:ఖాన్ని మిగిల్చింది.






