Chandrababu Emotional : ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేయడం వివాదాస్పదమవుతోంది. ఎలాంటి ఆధారాలు లేకున్నా జైల్లో వేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవ్యవస్థలో ఇలా కూడా జరుగుతుందా అని పలువురు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అవినీతి జరిగితే విచారణ జరిపి నిందితులుగా తేలితే అప్పుడు అరెస్టు చేయాలి. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారంటే వారి కుట్రలు తెలుస్తూనే ఉన్నాయి.
45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏనాడు కూడా ఎలాంటి మచ్చలేని రాజకీయ జీవితం చంద్రబాబుది. అలాంటి నేతను జైల్లో పెట్టి వైసీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చంద్రబాబుతో మాట్లాడుతూ ఇది మీకు శిక్షగా భావించొద్దు. మీ మీద వచ్చినవి ఆరోపణలు మాత్రమే. నేర నిరూపణ కాలేదు. చట్టం నిబంధనల ప్రకారమే రిమాండ్ విధించాం.
జైలులో సదుపాయాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు. మీరు 24 వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటారు. మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది. మీ తరఫు న్యాయవాదులు కస్టడీ అవసరం లేదని వాదించారు. చట్టం ముందు అందరు సమానమే. మీకు ఏవైనా సమస్యలుంటే చెప్పండి అంటూ న్యాయమూర్తి బాబును ప్రశ్నించారు.
ఎలాంటి ఆధారాలు లేకున్నా అరెస్టు చేయడం విడ్డూరమే. న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉన్న నేతగా బాబు నోరు మెదపడం లేదు. కానీ ఇంతటి దుర్మార్గమైన పాలన ఏ రాష్ట్రంలోనూ లేదు. జగన్ తీరు విమర్శలకు దారి తీస్తోంది. నేరుగా ఎదుర్కోలేక చట్టంతో చెలగాటం ఆడుతున్నారని వదంతులు వస్తున్నాయి. దీనికి ముమ్మాటికి బదులు తీర్చుకుంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
నాపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే. చట్టాన్ని గౌరవించే వాడిగా నేను ఏం మాట్లాడలేకుండా పోతున్నాను. చట్టాన్ని గౌరవిస్తా. నా మనసులో ఎంతో ఆవేదన ఉంది. ఆరోపణలకు కూడా శిక్ష వేస్తారా? న్యాయం గెలుస్తుందనే నమ్మకం నాకుంది అంటూ భావోద్వేగంతో జడ్జితో చెప్పారు చంద్రబాబు.