SI warned YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల యూనిఫాంలు ఊడదీస్తానని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎస్‌ఐ సుదాకర్ యాదవ్ కఠినంగా హెచ్చరించారు. “కష్టపడి చదివి, రన్నింగ్‌లు చేసి, పరీక్షలు పాసై, వేల మందిని దాటి ఈ యూనిఫాం వేసుకున్నాం. ఇది ఎవడికవ్వ దొరికే అరటితొక్క కాదు. మేము నిజాయితీగా ఉద్యోగం చేస్తున్నాం, ప్రజల పక్షాన నిలుస్తాం. నిజాయితీగానే జీవిస్తాం, చస్తాం కూడా. మేము అడ్డదారులు ఎప్పుడూ తొక్కం. జాగ్రత్తగా మాట్లాడాలి,” అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పోలీసుల గౌరవం కోసం ఎస్‌ఐ ఇచ్చిన ఈ దిట్టమైన సమాధానానికి అనేక మంది మద్దతు పలుకుతున్నారు.
Breaking News