35.9 C
India
Monday, May 12, 2025
More

    Chandrababu : ఇదిగో బాబు మీ ముందున్న కార్యాచరణ ఇదే?

    Date:

    Chandrababu
    Chandrababu

    Chandrababu : వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎంతలా ఇబ్బంది పడ్డారో అనేందుకు ఫలితాలే నిదర్శనం. ‘వైనాట్ 175’ అంటూ సిద్ధంలో గప్పాలు కొట్టిన జగన్ తను పాలనలోని అవకతవకలను మాత్రం వెనుతిరిగి చూసుకోలేదు. దీంతో కేవలం 11 సీట్లతో ప్రధాన ప్రతిపక్షం హోదాను కూడా కోల్పోయాడు. పైగా ఫలితాల రోజు సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్ లో తను చేసిన తప్పులను సరిచేసుకుంటానని చెప్పడం పక్కన పెట్టి అన్నీ చేశాను అయినా ఇంతలా పడిపోయాను ఏంటి? అని రాష్ట్ర ప్రజలను ప్రశ్నించాడు.

    అతిపెద్ద ఫిగర్ తో విజయం సాధించిన కూటమి తరుఫున చంద్రబాబు నాయుడు జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు కూటమి ముందు భారీ లక్ష్యాలు ఉన్నాయి. కూటమి మేనిఫోస్టేలో చాలా అంశాలను పెట్టింది. అంచెలంచెలుగా వాటిని నెరవేర్చుకుంటూ వెళ్లాలి. అందుకు డబ్బు కూడా ఇంపార్టెంట్ కాబట్టి నిధుల సేకరణ ఎలా అన్నదానిపై ఆలోచించాలి. ఇప్పటికి చాలా సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు.

    కూటమి మేనిఫెస్టోలని అంశాలు..

    ⇨ మెగా డీఎస్సీపై మొదటి సంతకం
    ⇨ సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు
    ⇨ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం
    ⇨ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
    ⇨ దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు
    ⇨ బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను
    ⇨ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500
    ⇨ యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
    ⇨ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి
    ⇨ తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు
    ⇨ రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం
    ⇨ వలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు
    ⇨ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, నిర్మాణం
    ⇨ ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
    ⇨ ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా
    ⇨ భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ
    ⇨ చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
    ⇨ పెళ్లి కానుక కింద రూ. లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ
    ⇨ పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ
    ⇨ ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ
    ⇨ చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు
    ⇨ ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం
    ⇨ మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. 217 జీవో రద్దుకు హామీ.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం
    ⇨ స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం
    ⇨ డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
    ⇨ చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు
    ⇨ ఆడపిల్లల విద్యకోసం ‘కలలకు రెక్కలు పథకం’ ప్రారంభం
    ⇨ ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10లక్షల రాయితీ
    ⇨ ఎన్డీఏ తెచ్చిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు
    ⇨ చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు
    ⇨ బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు
    ⇨ ఉద్యోగుల సీపీఎస్‌ సమీక్షించి, సరైన పరిష్కార మార్గం
    ⇨ ఔట్‌సోర్సింగ్‌, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం
    ⇨ కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం
    ⇨ ఆదరణ పథకం కింద ఏటా రూ.5వేల కోట్లతో పరికరాలు
    ⇨ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం
    ⇨ ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం
    ⇨ దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌
    ⇨ గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు
    ⇨ వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు
    ⇨ జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో కూడా నిర్ణయం, మంచి చేస్తామని హామీ
    ⇨ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద రూ.10వేలు
    ⇨ లా అండ్ ఆర్డర్ విషయంలో సరైన నిర్ణయాలు
    ⇨ రాజధానిగా అమరావతి కొనసాగింపు
    ⇨ ప్రతి మండలంలో జనరిక్‌ మందుల దుకాణాలు
    ⇨ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం
    ⇨ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్య బీమా
    ⇨ అందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు
    ⇨ విజయవాడలో హజ్‌ హౌస్‌ నిర్మిస్తాం
    ⇨ ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

     

    వీటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో నెరవేరిస్తే రానున్న ఐదేళ్లలో దేశంలోనే రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవన్నీ కాకున్నా.. ఇందులో ఎక్కువ మొత్తంలో నైనా అమలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    Chandrababu : ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు సంచలనం

    Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో కీలక ప్రకటన చేశారు. అలిపిరిలో...

    Chandrababu : బిల్ గేట్స్ తో చంద్రబాబు కీలక భేటి

    Chandrababu : దిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్...

    Chandrababu : ఢిల్లీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు!

    Chandrababu : NDA ప్రభుత్వంలో AP CM చంద్రబాబు కీలకమనే విషయం తెలిసిందే....